31న రైతు వేదికను ప్రారంభించ‌నున్న సీఎం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Oct 2020 7:49 AM GMT
31న రైతు వేదికను ప్రారంభించ‌నున్న సీఎం

జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో ఈ నెల 31(శ‌నివారం) మధ్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు వేదికను ప్రారంభించ‌నున్నారు. రైతు వేదిక సమీపంలోని పల్లె ప్రకృతి వనాన్ని సీఎం సందర్శిస్తారు. ఈ సందర్భంగా రైతులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారు.

ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణాన్ని చేపట్టిన ఉద్దేశాన్ని, రైతు వేదికల ఆవశ్యకతను, వాటి ద్వారా జరిగే కార్యకలాపాలను ముఖ్యమంత్రి వివరిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రైతుబంధు జిల్లా, మండల, గ్రామ కమిటీలను ఈ సమావేశానికి ఆహ్వానించారు.

వ్యవసాయ శాఖ మంత్రిఎస్. నిరంజన్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు.

Next Story