గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భర్తకు సీఎం సన్మానం
By న్యూస్‌మీటర్ తెలుగు Published on
2 Oct 2020 12:45 PM GMT

సీఎం కేసీఆర్ శుక్రవారం రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ భర్త, ప్రముఖ నెఫ్రాలజిస్ట్, బెస్ట్ మెడికల్ టీచర్, డాక్టర్ సౌందరరాజన్ కు ధన్వంతరి అవార్డు వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఇవాళ రాజ్ భవన్ లో డాక్టర్ సౌందరరాజన్ ను కలిసి ఘనంగా సన్మానించి అభినందించారు.
అంతకుముందు మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని లంగర్‌హౌస్‌లోని బాపుఘాట్‌లో జాతిపితకు గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నివాళులర్పించారు.
Next Story