సీఎం జగన్‌ తిరుమల పర్యటన ఖరారు.. ఎప్పుడంటే

By సుభాష్  Published on  21 Sept 2020 6:09 PM IST
సీఎం జగన్‌ తిరుమల పర్యటన ఖరారు.. ఎప్పుడంటే

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తిరుమల పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. ఈనెల 23న విజయవాడ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి సాయంత్రం 3.50 గంటలకు చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గం గుండా సాయంత్రం 5 గంటలకు తిరుమలలోని పద్మావతి గెస్ట్‌ హౌస్‌కు వెళ్తారు. సాయంత్రం 6.20 గంటలకు గరుడ వాహనం సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.

అలాగే 24న ఉదయం 8.10 గంటలకు కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పతో కలిసి సత్రాల నూతన భవన నిర్మాణ భూమి పూజలో పాల్గొంటారు. అదే రోజు ఉదయం 11.30 గంటలకు తిరుమల నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. కాగా, సీఎం జగన్‌ తిరుమల పర్యటన సందర్భంగా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

Next Story