ముఖ్యాంశాలు

  • వికేంద్రీకరణ బిల్లుపై అసెంబ్లీలో సీఎం జగన్‌
  • రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తా: సీఎం జగన్‌
  • అన్ని ప్రాంతాలతో పాటు అమరావతి అభివృద్ధి
  • అన్ని కమిటీలు వికేంద్రీకరణకే మొగ్గుచూపాయి
  • అమరావతిలో ఇన్‌సడైర్‌ ట్రేడింగ్‌: సీఎం జగన్‌
  • ప్రజలను ఇప్పటివరకు ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు: జగన్‌

అమరావతి: మూడు రాజధానుల నిర్ణయం ద్వారా అమరావతి ప్రాంతాన్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయమన్నారు సీఎం వైఎస్‌ జగన్‌. లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌ ఇక్కడే ఉంటుందని తెలిపారు. చట్టాలు కూడా ఇక్కడే చేస్తామన్నారు. అమరావతితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అందుకే పరిపాలన వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు. అమరావతిలో 8 కి.మీటర్ల పరిధిలో రాజధాని నిర్మాణాలకు లక్ష కోట్లు కావాలన్నారు. అయితే ఆ మొత్తంలో కేవలం పదో వంతు ఖర్చుతో విశాఖలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయవచ్చని తెలిపారు. తాను ప్రజలు అందరూ ఓటు వేస్తేనే గెలిచానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ వల్ల వచ్చే 10 ఏళ్లలో హైదరాబాద్‌ నగరానికి ధీటుగా తయారవుతుందన్నారు. అన్ని కమిటీలు అభివృద్ధి చేయాలని సూచించాయని, చివరికి శివరామకృష్ణణ్‌ కమిటీ కూడా ఇదే సూచించిందని సీఎం జగన్‌ తెలిపారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని సీఎం జగన్‌ వ్యాఖ్యనించారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై సోమవారం సుదీర్ఘంగా చర్చ జరిగింది. అసెంబ్లీలో ఆయన మూడు రాజధానులకు సంబంధించిన విషయం గురించి విపులంగా సమాధానం ఇచ్చారు. సీఎం జగన్‌ ప్రసంగిస్తుండగా టీడీపీ సభ్యులు పోడియమ్‌ వద్దకు చేరుకొని గట్టిగా నినాదాలు చేశారు. దీంతో వారిని ఒకరోజు పాటు సస్పెండ్‌ చేశారు.

వికేంద్రీకరణ జరగాలి: సీఎం జగన్‌

ఆ తర్వాత సీఎం జగన్‌ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆంధ్రప్రదేశ్‌కు మొదటగా మద్రాస్‌ రాజధానిగా ఉండేదని, ఆతర్వాత ఉమ్మడి రాష్ట్రంగా అవతరిస్తూ రాజధాని కర్నూలును కూడా త్యాగం చేశామని సీఎం జగన్‌ తెలిపారు. ఆ తర్వాత 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్‌ 10 ఏళ్ల పాటు రాజధాని ఉండే అవకాశాన్ని, ఇక్కడే ఉన్న ఓ మనిషి చేసిన తప్పిదం వల్ల దానిని కూడా కోల్పోయమన్నారు.

శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్‌ కమిటీలు తాము వేసినవి కావని ప్రజలందరీకి తెలుసన్నారు. అపట్లో తెలుగా కాంగ్రెస్‌ ప్రభుత్వాలు వీటిని ఏర్పాటు చేసి చంద్రబాబును కాపాడినవి అని అన్నారు. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మాత్రం ఆ కమిటీలకు గడ్డిపరక విలువ కూడా ఇవ్వలేదన్నారు. బీసీజీ, కేటీ రవీంద్రన్‌ ఆధ్వరంలోని జీఎన్‌రావు కమిటీ వికేంద్రీకరణకే మద్దతు తెలిపిందన్నారు. ఈ కమిటీల నివేదికలపై హైపవర్‌ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిందని, ఆ తర్వాత కొన్ని సూచనలు కూడా చేసిందని తెలిపారు.

అమరావతిలో 144 సెక్షన్‌ గురించి ఇంత గొడవ చేయాల్సిన అవసరం లేదని సీఎం జగన్‌ అన్నారు. ఇదే జిల్లాలోని మచిలీపట్నంలో గత నాలుగేళ్లుగా 144 సెక్షన్‌ అమలులో ఉందని గుర్తు చేశారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో 2016 నుంచి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు 144 సెక్షన్‌ ఉందన్నారు. దీనికి ఇంతగా యాగీ చేయడం తనకు ఆశ్యర్యంగా ఉందన్నారు.

అసెంబ్లీలో సీఎం జగన్‌ అమరావతి ప్రజలకు, రైతులకు భరోసా కల్పించారు. అమరావతిని అభివృద్ధి చేస్తామని, అలాగే విశాఖపట్నం, కర్నూలును కూడా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. రాజధాని అమరావతి రైతులకు ఇస్తున్న యాన్యుటీగా స్తున్న పరిహారాన్ని మరో ఐదేళ్లు పెంచుతామన్నారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతం, ప్రతి ఒక్కరి సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తానని సీఎం జగన్‌ తెలిపారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.