కర్నూలులో సీఎం జగన్‌ పర్యటన

By అంజి  Published on  18 Feb 2020 4:39 AM GMT
కర్నూలులో సీఎం జగన్‌ పర్యటన

అమరావతి: నేడు కర్నూలు జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటించనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అలాగే డాక్టర్‌ వైఎస్సార్‌ కంటివెలుగు మూడో దశ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా హెల్త్‌ సబ్‌ సెంటర్ల నిర్మాణానికి సీఎం జగన్‌ శంకుస్థాపన చేస్తారు.

సీఎం జగన్‌.. కర్నూలు టూర్ షెడ్యూల్‌

ఉదయం 10.35 గంటలకు సీఎం జగన్‌ హెలికాప్టర్‌లో ఎస్‌ఏపీ క్యాంప్‌లోని ఏపీఎస్పీ బెటాలియన్‌ చేరుకుంటారు.

10.45 గంటలకు జిల్లా మంత్రులు, వైసీపీ నాయకులు, అధికారులు సీఎం జగన్‌కు స్వాగతం పలుకుతారు.

10.50 గంటలకు ఎస్‌ఏపీ క్యాంప్‌ నుంచి బయల్దేరి 11 గంటలకు ఎస్టీబీసీ కాలేజీ గ్రౌండ్‌కు చేరుకుంటారు.

11.20 గంటలకు డాక్టర్‌ వైఎస్సాఆర్‌ కంటి వెలుగు మూడో దశ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా హెల్త్‌ సబ్‌ సెంటర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.

12.50 వరకు సీఎం జగన్‌ బహిరంగ సభలో పాల్గొంటారు.

12.50 గంటలకు అక్కడి నుంచి బయల్దేరి 1.00 గంటలకు ఏపీఎస్‌పీ బెటాలియన్‌ చేరుకుంటారు.

1.10 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌ బయలుదేరి 1.20 గంటలకు ఓర్వకల్లు ఏయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో 2.30 గన్నవరం ఎయినర్‌ పోర్టుకు చేరుకుంటారు.

Next Story