Fact Check : కేరళలో రక్షా బంధన్ ను బ్యాన్ చేశారా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 Oct 2020 8:11 PM ISTరక్షాబంధన్ వెళ్ళిపోయి దాదాపుగా రెండు నెలలు పైనే అవుతోంది. ఇలాంటి సమయంలో కేరళలో రక్షా బంధన్ చేసుకోడానికి వీలు లేదంటూ నిర్ణయం తీసుకున్నారని ఓ పోస్టును సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తూ ఉన్నారు. 'డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కేరళ, డాక్టర్ రామ్లా బీవీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో రక్షా బంధన్ జరుపుకోకూడదని కొత్త నిబంధనలను తీసుకుని వచ్చారని' పోస్టు వైరల్ అవుతోంది. హిందూ పండుగ అవ్వడం వలనే ఆమె రక్షా బంధన్ ను జరుపుకోకూడదని చెబుతూ ఉన్నారని ఈ పోస్టుల్లో తెలిపారు.
ఈ పోస్టు నిజమేనని నమ్మిన నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ వచ్చారు. ” Kerala medical education director Dr. Tampa Beevi bans Raksha Bandhan in Govt medical colleges as the festival is Hindu” అంటూ మరికొందరు పోస్టులను పెట్టారు.
‘Organizer‘ అనే సైట్ లో ఇందుకు సంబంధించిన కథనం అక్టోబర్ 3, 2020న వచ్చిందని చెబుతూ ఆ స్క్రీన్ షాట్స్ ను షేర్ చేస్తూ వస్తున్నారు. ”Kerala Medical Education Director Dr Ramla Beevi bans Raksha Bandhan in Govt medical colleges as the festival is Hindu" అన్నది ఆర్టికల్ లో ఉంది. రమ్లా బీవీ రక్షా బంధన్ ను ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో బ్యాన్ చేశారు అన్నది ఆర్టికల్ సారాంశం.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
సెప్టెంబర్ 11, 2020న డాక్టర్ రమ్లా బీవీ మలయాళంలో ఒక సర్క్యులర్ ను విడుదల చేశారు. అందులో రక్షా బంధన్ మాత్రమే కాదు ఇతర ఏ ఫెస్టివల్స్ ను అయినా జరుపుకోవాలంటే అనుమతి తీసుకోవాల్సిందే అని ఆ సర్క్యులర్ లో తెలిపారు. అంతే తప్పితే రక్షాబంధన్ ను జరుపుకూడదు అని చెప్పలేదు.
https://drive.google.com/file/d/1cNdYFewrTK2ADyGPvUZvDKm51MQfSVHv/view
రక్షా బంధన్ ను ఇటీవలే ఓ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఆర్.ఎస్.ఎస్. సంస్థ నిర్వహించింది. దీనిపై కాలేజీ అధికారులు సీరియస్ అయ్యారు. ఎటువంటి అనుమతులు కూడా తీసుకోకుండా రక్షాబంధన్ కార్యక్రమాలను నిర్వహించారని అందులో చెప్పుకొచ్చారు. ఇకపై ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలంటే ఇన్స్టిట్యూషన్ హెడ్ ను, ప్రభుత్వ అధికారులను సంప్రదించాలని కోరారు. అంతేకానీ ఎక్కడ కూడా రక్షా బంధన్ ను బ్యాన్ చేస్తున్నామని చెప్పలేదు. 2019లో ఎర్నాకులం మెడికల్ కాలేజీలో రక్షా బంధన్ కార్యక్రమాలను నిర్వహించినప్పుడు రెండు గ్రూప్ ల మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. ఇకపై అలాంటి గొడవలు జరగకుండా ఉండాలని ఈ నిబంధనలను తీసుకుని వచ్చారు. ఏదైనా ఈవెంట్ చేసుకునే ముందు ఉన్నతాధికారులను సంప్రదించామని కోరారు.
సీపీఐ(ఎం) నేత ఏఎన్ షంషీర్ మాట్లాడుతూ ఏ కాలేజీలో కూడా హిందూ పండుగలను బ్యాన్ చేయలేదని.. ఏదైనా కార్యక్రమాన్ని నిర్వహించే సమయంలో అనుమతులు తీసుకోవాలని చెప్పారు. ఇదే విషయాన్ని ‘Times Now‘ కూడా ట్వీట్ చేసింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా తామెక్కడా రక్షా బంధన్ ను బ్యాన్ చేయలేదని తెలిపింది.
#Exclusive | Raksha Bandhan row: Kerala Govt responds.
No Hindu celebration has been banned. The circular only says that prior permission should be taken before holding such events: AN Shamseer, Leader, CPI(M).
Details by Vivek Karindalam. pic.twitter.com/BhAgEUuRj9
— TIMES NOW (@TimesNow) October 6, 2020
రక్షా బంధన్ ను కేరళలో బ్యాన్ చేశారు అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.