Fact Check : కోవిడ్‌-19 పాజిటివ్ వచ్చిన దిలీప్ ఘోష్ ను మాస్కులు లేకుండా బీజేపీ నేతలు కలిశారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Oct 2020 10:03 AM GMT
Fact Check : కోవిడ్‌-19 పాజిటివ్ వచ్చిన దిలీప్ ఘోష్ ను మాస్కులు లేకుండా బీజేపీ నేతలు కలిశారా..?

బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ కు ఇటీవలే కోవిద్-19 పాజిటివ్ వచ్చింది. ఆయన్ను పరామర్శించడానికి బీజేపీ నేతలు వెళ్లారని.. ఒక్కరు కూడా కనీసం మాస్కులు పెట్టుకోలేదని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు. దిలీప్ ఘోష్ ను కలిసిన నేతలెవరూ మాస్కులు పెట్టుకోలేదని ఓ ఫోటోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తూ ఉన్నారు.

ట్విట్టర్ యూజర్ “Meeting COVID Positive Dilip Ghosh without wearing any Mask. Only BJP Leaders can Show Such Courage. @MukulR_Official @KailashOnline.” అంటూ పోస్టు పెట్టారు.

'కోవిద్ పాజిటివ్ వచ్చిన దిలీప్ ఘోష్ ను మాస్కులు లేకుండా పరామర్శించడానికి వెళ్లారు. కేవలం బీజేపీ నేతలకు మాత్రమే అంత ధైర్యం ఉంటుంది' అంటూ పోస్టులు పెట్టడం గమనించవచ్చు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

న్యూస్ మీటర్ కీవర్డ్స్ సెర్చ్ చేయగా ఈ ఫోటో ఇప్పటిది కాదని తేలింది. Kolkata 24×7 లో జనవరి 2018న ఇదే ఫోటోను పెట్టి కథనాన్ని రాసుకుని వచ్చారు. దిలీప్ ఘోష్ కు సర్జరీ నిర్వహించారని.. ఆ సర్జరీ తర్వాత ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆ వార్తా కథనాల్లో స్పష్టం చేశారు.

Bangladesh Ekattor లో కూడా ఆయన ఆరోగ్యంపై కథనాలను రాశారు. జనవరి నెల 2018 సంవత్సరంలో దిలీప్ ఘోష్ అన్సనోల్ లో పబ్లిక్ మీటింగ్ పూర్తీ చేసుకుని వసంతపంచమిని జరుపుకోడానికి ఖరగ్ పూర్ వెళుతున్న సమయంలో ఆయనకు వెన్నులో విపరీతమైన నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేర్చారు అని కథనాన్ని రాసుకొచ్చారు. పలు మీడియా సంస్థలు కూడా అప్పట్లో ఆయన ఆసుపత్రి పాలైన వార్తలను రాశాయి.. అలాగే ఈ ఫోటోను కూడా పోస్టు చేశాయి.

ఈ వైరల్ అవుతున్న ఫోటో ఇప్పటిదే అంటూ ఏ మీడియా సంస్థ కూడా పోస్టు చేయలేదు. దిలీప్ ఘోష్ కు కరోనా పాజిటివ్ వచ్చాక తీసిన ఫోటో ఇది కాదు. 2018 జనవరి నెలలో తీసిన ఫోటో ఇది. దిలీప్ ఘోష్ ను మాస్కులు లేకుండా బీజేపీ నేతలు ఆసుపత్రిలో పరామర్శించారు అనే పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

Claim Review:Fact Check : కోవిడ్‌-19 పాజిటివ్ వచ్చిన దిలీప్ ఘోష్ ను మాస్కులు లేకుండా బీజేపీ నేతలు కలిశారా..?
Claim Reviewed By:Misha Rajani
Claim Fact Check:false
Next Story