Fact Check : మసీదులు తెరవాలంటూ హైదరాబాద్‌లో ముస్లింలు నిరసన చేపట్టారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 May 2020 1:21 AM GMT
Fact Check : మసీదులు తెరవాలంటూ హైదరాబాద్‌లో ముస్లింలు నిరసన చేపట్టారా..?

కోవిద్-19 కారణంగా భారతదేశంలో లాక్ డౌన్ ను మే 17 వరకూ పొడిగించారు. గత కొద్దిరోజులుగా చోటు చేసుకుంటున్న ఘటనల కారణంగా ముస్లింలను టార్గెట్ చేస్తూ కొందరు వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ వస్తున్నారు. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. తాజాగా మరో వీడియో హైదరాబాద్ లోని టోలీ చౌకిలో చోటుచేసుకున్నదిగా చెబుతూ షేర్ చేస్తూ ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా మూతపడిన మసీదులను తెరవాలని కోరుతూ ముస్లింలు హైదరాబాద్ లోని టోలీ చౌకీలో నిరసన ప్రదర్శనలు చేస్తున్నారన్నది ఆ వీడియోను ట్యాగ్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

ఈ వీడియో ఫేస్ బుక్ లో ఎక్కువగా వైరల్ చేస్తూ .. దానికి “Muslim men are causing a disturbance at Tolichowki, under the flyover bridge, demanding the reopening of a mosque.” ఈ కొటేషన్ ను తగిలించారు.

ముస్లింలు టోలీ చౌకి ప్రాంతంలో ఇబ్బందులు సృష్టిస్తున్నారని.. ఫ్లై ఓవర్ కింద వారు మసీదులను తిరిగి తెరచాలని కోరుతూ వారు నిరసనను తెలియజేస్తూ ఉన్నారన్నది సారాంశం.

ఇది యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేశారు కొందరు.

దీన్ని హైదరాబాద్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ టి.ఉమా మహేంద్ర తన ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేశారు. దీన్ని పలువురు షేర్లు కూడా చేస్తున్నారు.

నిజమెంత:

ఈ వైరల్ అవుతున్న వీడియోలపై న్యూస్ మీటర్ కీవర్డ్స్ ను ఉపయోగించి ‘Tolichowki Protest’ అని వెతకగా కొన్ని వీడియోలు కనిపించాయి. వలస కార్మికులు తమను తమ తమ స్వస్థలాలకు పంపించాల్సిందిగా డిమాండ్ చేస్తున్న వీడియోలు కనిపించాయి.

లోకల్ ఛానల్స్ కూడా ఈ వార్తలను కవర్ చేశాయి. Siasat Daily రిపోర్ట్ ప్రకారం 'వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ కార్మికులతో మాట్లాడుతూ మీరు మీ నిరసన కార్యక్రామాలను విరమించుకోవాలని కోరారు. అలాగే మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వం వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చడం కోసం ప్రత్యేకంగా రైళ్లను నడుపుతోందని తెలుసుకుని వారందరూ అలా రోడ్ల మీదకు వచ్చారని' అన్నారు. సాక్షి పోస్ట్ లో కూడా ఈ వీడియోను కవర్ చేశారు.

పొలిటికల్ అనలిస్ట్ సయ్యద్ అబ్దహు కషఫ్ టి. ఉమా మహేంద్ర మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిజాలు తెలుసుకోకుండా ఉమా మహేంద్ర తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారంటూ సైబర్ క్రైమ్ పోలీసులను సయ్యద్ ఆశ్రయించారు. దీనిపై న్యూస్ మీటర్ తో సయ్యద్ మాట్లాడుతూ.. తాను సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ లో ఉమా మహేందర్ మీద.. మరో ఇద్దరు వ్యక్తుల మీద ఫిర్యాదు చేశానని.. కానీ పోలీసులు ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు.

దీన్ని బట్టి ముస్లింలు టోలీ చౌకీలో మసీదులను తెరవాలంటూ నిరసన చేపట్టారు అన్నది 'పచ్చి అబద్ధం'. వలస కూలీలు తమను అధికారులు సొంత ఊళ్లకు పంపించాలని కోరుతూ చేపట్టిన నిరసన ఇది.

Claim Review:Fact Check : మసీదులు తెరవాలంటూ హైదరాబాద్‌లో ముస్లింలు నిరసన చేపట్టారా..?
Claim Fact Check:false
Next Story