నిద్ర ప‌ట్టేసింది బావా - 'ఆ మాత్రం వాడ‌కం ఉంటుంది మ‌రీ'

By సుభాష్  Published on  18 Jan 2020 9:21 AM IST
నిద్ర ప‌ట్టేసింది బావా - ఆ మాత్రం వాడ‌కం ఉంటుంది మ‌రీ

అయినా, వాళ్లు మాత్రం ఏం చేస్తారులేండి..? ఉన్న‌దే ఆరుగురు. ఆ ఆరుగురిలోనూ ఒక‌రేమో హై కాస్టూ, ఇద్ద‌రేమో బిలో యావ‌రేజు. మ‌రొక‌రికి ఫిగ‌ర్ ఉన్నా ఫాలోయింగ్ లేక‌పోయే. ఇక మిగిలింది మిడిల్‌లోని ఇద్దరే. ఆయ‌నెవ‌రో చెప్పిన‌ట్టు ఇక్క‌డ డిమాండ్ ఉన్నా స‌ప్ల‌య్ లేక‌పాయే. దాంతో అన్ని విధాలా అందుబాటులో ఉన్న ఆ ఇద్ద‌ర్ని త‌మ‌కంటే.. త‌మ‌క‌ని పోట్లాడుకునే వాల‌కం. త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో ఎవ్వ‌రినీ నొప్పించ‌క ఒక‌రి త‌రువాత మ‌రొక‌రికి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వాల్సి రావ‌డం.

ఇటు వీళ్ల అందం వాళ్ల‌ను వ‌ద‌ల‌దు.. అటు వాళ్ల అవ‌స‌రం వీళ్ల‌ను వ‌ద‌ల‌దు. ఇద్ద‌రూ ఇద్ద‌రే. త‌మ‌కున్న డిమాండ్‌ను బట్టి రేట్‌ను కూడా అమాంతం పెంచేశారు. దాంతో ప‌గ‌లు, రాత్రి అన్న తేడా లేకుండా షోల మీద షోలు. ఇక నిద్రెక్క‌డ ప‌ట్టుద్దీ.. అస్స‌లు ప‌ట్ట‌దు సుమీ! కోట్ల‌కు కోట్లు పెట్టి కార్లు, అపార్ట్‌మెంట్‌లు కొన్నాక ఇవ‌న్నీ త‌ప్ప‌వుగా. ఎంత చేసినా వ‌చ్చిందంతా ఈఎంఐల‌కే స‌రిపోయే. ఇంకేం మిగిలింద‌నీ. ఎన్ని నిద్ర‌లేని షోలు చేస్తే ఏం లాభం. కాస్తైనా మిగ‌లాలిగా. ఉన్న‌ది ఇద్ద‌ర‌మే అయినా.. గిట్టుబాటు కావొద్దూ! చెబితే అపార్ధం చేసుకుంటారుగానీ.. ఆ గిట్టుబాటు ధ‌ర లేక‌నే ఈ డే అండ్ నైట్ షోలు.

ఇలా తన మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌కు చెప్ప‌క‌నే చెప్పింది స్టార్‌ యాంక‌ర్ క‌మ్ న‌టి అన‌సూయ‌. అస‌లే పండ‌గ‌ల సీజ‌న్ కావ‌డంతో బుల్లితెర‌పై అన‌సూయ జోరు య‌మ స్పీడుగా కొన‌సాగుతోంది. ఎంత‌లా అంటే..? ఛానెళ్ల‌నేమైనా అన‌సూయ ద‌త్త‌త తీసుకుందా..? అని డౌటొచ్చేంత‌లా. ఆ షో.. ఈ షో అన్న తేడా లేకుండా ప్ర‌తి ఛానెల్‌లోనూ క‌నిపిస్తూ త‌న అభిమానుల‌ను నిత్యం అల‌రిస్తోంది. కెరీర్ ప్రారంభంలో సొగ‌సుల యాంక‌రింగ్‌కే ప‌రిమిత‌మైన అన‌సూయ ప్ర‌స్తుతం దానికి అభిన‌యాన్ని అద్ది స‌రికొత్త అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటోంది.

అయితే, తాజాగా విడుద‌లైన జ‌బ‌ర్ద‌స్త్ ప్రోమోలో హైప‌ర్ ఆదితో క‌లిసి కామెడీని పండించింది అన‌సూయ, ఈ ప్రోమోలోనే తాను ఎంత బిజీ యాంక‌ర్నో అన్న విష‌యాన్ని హైప‌ర్ ఆది డైలాగ్ రూపంలో చెప్పుకొచ్చింది. ముందుగా ఆటో నుంచి దిగిన అన‌సూయ బావా.. నిద్ర ప‌ట్టేసింది బావా అరి చెప్ప‌డంతో

ఈ షో పెట్టుకుని.. ముందు రోజు ఆ షోకు వెళితే నిద్రే ప‌ట్టుద్ది. ఒక ప‌క్క‌నేమో ప్ర‌తి రోజు పండగే అంటావ్, నైటైతే జ‌బ‌ర్ద‌స్త్ అంటావ్‌, ఏద‌న్నా అంటే ఇళ్లంటావ్‌.. ఈఎంఐ అంటావ్, అంటూ అన‌సూయ‌ను ఉద్దేశిస్తూ హైప‌ర్ ఆది చెప్పిన పంచ్‌లు బాగానే పేలాయ్‌. కాగా, ఈ గురువారం ప్ర‌సారం కానున్న ఈ షోలో రోజా ప‌క్క సీటును ప్ర‌ముఖ గాయ‌కుడు మ‌ను భ‌ర్తీ చేశారు.

Next Story