సీఎం జగన్‌తో సినీ పెద్దల సమావేశం
By సుభాష్ Published on 9 Jun 2020 10:01 AM ISTదేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ అమలవుతోంది. దీని ప్రభావం ఎన్నో రంగాలపై చూపింది. సినీ రంగం సైతం కుదేలైపోయింది. లాక్‌డౌన్ కారణంగా సినిమా, టీవీ షూటింగ్‌లు సైతం నిలిచిపోయాయి. ఈ కారణంగా ఇండస్ట్రీలో పని చేసే వేలాది మంది ఉపాధి కోల్పోయారు. ఇక తాజాగా తెలంగాణలో లాక్‌డౌన్ నుంచి సినీ రంగాలనికి సడలింపులు ఇస్తూ షూటింగ్‌లు, టీవీ షూటింగ్ లు నిర్వహించుకునేందుకు సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి బృందం భేటీ కానుంది. ఇది చదవండి: ఏపీలో భారీ వర్షాలు
లాక్‌డౌన్ నిబంధనలకు భారీ సడలింపులు ఇవ్వడంతో సినిమా, టీవీ సీరియల్ షూటింగ్‌లకు అనుమతి ఇవ్వాలని చిత్రపరిశ్రమ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తోంది. ఈ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు చిరంజీవితో పాటు నాగార్జున, దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివ, జీవిత, నిర్మాత కళ్యాణ్ తదితర సినీ ప్రముఖులు జగన్‌తో భేటీ కానున్నారు. ఈ భేటీలో సినిమా, టీవీ షూటింగ్‌లకు అనుమతి కోరుతూ, సినిమా థియేటర్లపై కూడా చర్చించనున్నారు. ఇది చదవండి: ఏపీలో లాక్‌డౌన్ పొడిగిస్తూ.. మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో కరోనా వైరస్ మాత్రం తీవ్రస్థాయిలో ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో ఇప్పటికే హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, ప్రార్థనా మందిరాలు, ఆలయాలు తెరుచుకున్నాయి.