కరోనాపై పాటపాడిన చిరంజీవి, నాగార్జున.. విన్నారంటే..

By అంజి
Published on : 30 March 2020 7:28 AM IST

కరోనాపై పాటపాడిన చిరంజీవి, నాగార్జున.. విన్నారంటే..

హైదరాబాద్‌: కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సినిమా ప్రముఖులు, మేధావులు కృషి చేస్తున్నారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు పలువురు సినిమా ప్రముఖులు రాష్ట్ర ప్రభుత్వాలకు తమ వంతు సాయం ప్రకటించారు. సిని కార్మికుల కోసం మెగాస్టార్‌ చిరంజీవి ఏర్పాటు చేసిన క్రైసిస్‌ ఛారిటీకి సినిమా తారాలు పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తున్నారు. లాక్‌డౌన్‌ విధించడంతో సినీ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. దీంతో వారిని ఆదుకునేందుకు సినీ నటులు ముందుకొస్తున్నారు. తమ వంతు సాయం చేస్తూ.. కార్మికులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సీనియర్‌ హీరోలు చిరంజీవి, నాగార్జున, జూనియర్‌ హీరోలు వరుణతేజ్‌, సాయితేజ్‌లు కలిసి పాట పాడారు. పాటలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు కోటి సర్వపరిచారు. దీంతో వీరంతా ఈ పాటకు గొంతు కలిపారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ పాటకు విపరీతమైన స్పందన వస్తోంది. చిరంజీవి, నాగార్జున, వరుణ్‌తేజ్‌, సాయితేజ్‌, కోటి పాడిన ఈ పాట సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story