చిరంజీవి తీసిన ఫోటో.. మధ్యలో ఉన్నది ఎవరో చెప్పండంటూ..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Aug 2020 12:51 PM GMT
చిరంజీవి తీసిన ఫోటో.. మధ్యలో ఉన్నది ఎవరో చెప్పండంటూ..!

నేడు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం కావడంతో పలువురు తాము తీసిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ ఉన్నారు. ఆ ఫోటోలకు తమకు ఉన్న అనుబంధాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. మెగా స్టార్ చిరంజీవి కూడా తాను మొదటిసారి తీసిన ఫోటో గురించి అభిమానులకు తెలియజేసారు.

ప్రపంచ ఫొటోగ్రఫీ డే సందర్భంగా తాను తీసిన మొదటి ఫోటోను అభిమానులతో పంచుకున్నారు . 'ఈ రోజు ప్రపంచ ఫొటోగ్రఫీ డే.. నేను మొదటి ఫోటో తీసింది ఇలాంటి agfa3 కెమెరాతో. ఆ మొదటి ఫోటో మరి కాసేపటిలో..' అంటూ చిరంజీవి మొదట పోస్టు పెట్టారు. ఆ తర్వాత ఆయన తీసిన ఫోటోను అభిమానుల ముందు ఉంచారు.

'నేను తీసిన మొదటి ఫోటో.. ఈ ఐదుగురిలో ఒక వ్యక్తి మీకు బాగా తెలుసు.. చెప్పుకోండి చూద్దాం.' అంటూ ఓ ఫోటో పెట్టారు మెగా స్టార్.

ఆ మధ్యలో ఉన్న వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ అభిమానులు చెబుతున్నారు.

లెజెండరీ సింగర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం మెరుగుపడుతుండటంపై సంతోషం వ్యక్తం చేస్తూ ఒక వీడియో మెసేజ్‌ను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. బాలు ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులతో మాట్లాడి తెలుసుకుంటున్నానని చిరంజీవి అన్నారు. బాలుతో, ఆయన కుటుంబంతో తనకు ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. కోటాను కోట్ల మంది అభిమాన గాయకుడు, దేశం గర్వించే అత్యుత్తమ కళాకారుడు, నా సోదర సమానుడు ఎస్పీ బాలు రోజురోజుకీ కోలుకుంటున్నారని.. వైద్యానికి మెరుగ్గా స్పందిస్తున్నారని విని సంతోషిస్తున్నాను.

ఆ సంతోషాన్ని మీతో పంచుకోవాలనే ఇలా మీ ముందుకు వచ్చాను. బాలుతో నాకు సినిమా పరమైన అనుబంధమే కాదు.. కుటుంబ పరంగా కూడా ఎంతో సాన్నిహిత్యం ఉందన్నారు చిరంజీవి. ఆయనకున్న కోట్లాది మంది అభిమానులతో పాటు నేనూ ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. త్వరగా బాలు మన ముందుకు వచ్చి రెట్టించిన ఉత్సాహంతో మునుపటికంటే మరింతగా వినోదం పంచాలని, అలరించాలని, ఆహ్లాదపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చిరంజీవి అన్నారు.

ఆగష్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిరు 152 వ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఆగష్టు 22, సాయంత్రం 4 గంటలకు రాబోతోందని రామ్ చరణ్ స్పష్టం చేశారు. చిరంజీవి 152వ చిత్రం పేరు ‘ఆచార్య’ అంటూ ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తూ ఉండగా.. రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఫస్ట్ లుక్ తో పాటూ మోషన్ పోస్టర్ ను ఆగష్టు 22 సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేయనున్నారు.

Next Story