చిత్ర పరిశ్రమను షాక్ కు గురిచేసిన ఈ స్టార్ ఎవరో తెలుసా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Sep 2020 4:42 PM GMT
చిత్ర పరిశ్రమను షాక్ కు గురిచేసిన ఈ స్టార్ ఎవరో తెలుసా..?

ఈ ఫోటోను చూస్తున్నారు కదా..? ఎవరా అని మీకు అనిపిస్తోందా..! ఆయన మరెవరో కాదు మెగా స్టార్ చిరంజీవి. అసలు ఎవరూ ఊహించని లుక్ తో ఆయన సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తూ ఉన్నారు. గుండుతో.. కళ్లద్దాలతో ఏంటి షాక్ అయ్యారా అంటూ మెగా స్టార్ ఫోటోను అప్లోడ్ చేశారు.

View this post on Instagram

#UrbanMonk Can I think like a monk?

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) on

ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ లలో పలువురు ఈ ఫోటోను చూసి ఈ లుక్ ఏంటి చిరంజీవి గారూ..! అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. 'అర్బన్ మాంక్' అంటూ సెల్ఫీని పోస్టు చేశారు చిరంజీవి. ఈ ఫోటోను చూసి రామ్ చరణ్ కూడా షాక్ అయ్యాడు. అప్పా నేను చూస్తోంది నిజమేనా అంటూ కామెంట్ పెట్టాడు చెర్రీ. అలాగే పలువురు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా ఇంస్టా గ్రామ్ లో మెగా స్టార్ పెట్టిన ఫోటోకు కామెంట్లు చేస్తూ ఉన్నారు.

R1

వరుణ్ తేజ్.. వావ్ లుకింగ్ గ్రేట్ డాడీ అంటూ కామెంట్ చేశాడు. కళ్యాణ్ దేవ్ 'హాహా.. కూల్ మామయ్యా..!' అంటూ తన స్పందనను తెలియజేశాడు. మెగా బ్రదర్ నాగబాబు 'No one does it better than you అన్నయ్య... Firing up the Trends with your Style & Killer Looks. Adapting is what People do.. Influencing is what Megastar does...!' అంటూ అన్నను పొగిడేశాడు. పలువురు ప్రముఖులు బాస్ లుక్ కు ఫిదా అయ్యారు.

R2

చిరంజీవి వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు. చాలా మంది యువ దర్శకులతో తన సినిమాలను లైనప్ లో పెట్టుకున్నారు చిరంజీవి. ప్రస్తుతం ఆయన ఆచార్య సినిమాలో నటిస్తూ ఉన్నారు. చిరంజీవి పుట్టినరోజున అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా స్టోరీ మీద వివాదం కూడా చెలరేగింది. ఈ స్టోరీ ఎవరిదీ కాదని మీడియా ముందుకు వచ్చి కొరటాల శివ క్లారిటీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. లాక్ డౌన్ కు ముందు చాలా వరకూ షూటింగ్ పూర్తవ్వగా.. మిగిలిన భాగం షూటింగ్ అతి త్వరలోనే మొదలుకానుంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ నటిస్తోంది.

Next Story