లాక్‌డౌన్ ఎఫెక్ట్‌ : త‌న‌యుడితో ట్రిమ్మింగ్ చేయించుకుంటున్న కేంద్ర‌మంత్రి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 April 2020 5:18 PM GMT
లాక్‌డౌన్ ఎఫెక్ట్‌ : త‌న‌యుడితో ట్రిమ్మింగ్ చేయించుకుంటున్న కేంద్ర‌మంత్రి

కరోనా విల‌య‌తాండ‌వం చేస్తుండ‌టంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. దీంతో సామాన్యుడి నుండి మంత్రుల వ‌ర‌కూ అంద‌రూ ఇంటి ప‌ట్టునే ఉంటున్నారు. అయితే ఇంట్లో ఉన్న వారు ఖాళీగా కూర్చోకుండా ఏదో ఓప‌ని చేస్తూనే ఉన్నారు. స‌ర‌దా కోస‌మో లేక సందేశ‌మిద్దామ‌నో చేసే ఆ ప‌నులు నెటిజ‌న్ల ఆద‌రాభిమానాలు చూర‌గొంటున్నాయి.

తాజాగా.. లోక్ జనశక్తి పార్టీ అధినేత‌, కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ తనయుడు చిరాగ్‌ పాశ్వాన్ చేసిన ఓ ప‌ని కూడా నెటిజ‌న్ల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంది. వివ‌రాళ్లోకెళితే.. చిరాగ్‌ తనలో ఉన్న కళను బయటపెట్టారు. లాక్‌డౌన్ కార‌ణంగా సెలూన్లు మూతపడటంటో చిరాగ్‌.. ఇంట్లోనే తన తండ్రికి టిమ్మింగ్‌ చేశారు. ఇందుకు సంబంధించిన‌ వీడియోను కూడా ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.



వీడియోతో పాటు.. లాక్‌డౌన్ క‌ఠిన‌త‌రంగా ఉండొచ్చు.. కానీ దాంట్లోనూ వెలుగులున్నాయి. నాలో ఈ టాలెంట్‌ ఉందని నాకు తెలియదు. ఇలా కరోనాపై పోరాడి.. అందమైన జ్ఞాపకాలను మిగిల్చుకుందామ‌ని చిరాగ్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. తండ్రికి తుదిమెరుగులు దిద్దుతున్న తన‌యుడు అంటూ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Next Story