జ‌గ‌న్ బ‌య‌టికి వ‌చ్చి తిరిగితే తెలుస్తుంది : చినరాజప్ప

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 April 2020 12:36 PM IST
జ‌గ‌న్ బ‌య‌టికి వ‌చ్చి తిరిగితే తెలుస్తుంది : చినరాజప్ప

క‌రోనా వైర‌స్(కొవిడ్‌-19) ఎంత తీవ్రంగా ఉందో.. సీఎం జ‌గ‌న్ బ‌య‌టికి వ‌చ్చి తిరిగితే తెలుస్తుంద‌ని టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. లాక్‌డౌన్‌, క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్ర‌జ‌లు ప‌డుతున్న బాధ‌లు, ఇబ్బందుల‌ను జ‌గ‌న్ అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం ఆరోపించారు. చంద్రబాబు బయటకు రాలేదంటూ వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, బొత్స చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ హైదరాబాద్ ఇంట్లోనే ఉండి కరోనా పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. తగిన సూచనలు చేస్తున్నార‌ని తెలిపారు. చంద్రబాబు బయటకు వస్తే వైసీపీ నేతలకు భయమన్నారు. జగన్ సమీక్షలు చేస్తూ కనీసం మీడియా ముందుకు కూడా రావడం లేద‌ని దుయ్య‌బ‌ట్టారు.

Next Story