లడఖ్‌ సరిహద్దుల్లో తొకముడిచిన చైనా సైన్యం

By సుభాష్  Published on  6 July 2020 1:44 PM IST
లడఖ్‌ సరిహద్దుల్లో తొకముడిచిన చైనా సైన్యం

లడఖ్‌ సరిహద్దుల్లో చైనా సైన్యం తొకముడిచింది. భారత్‌ - చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణ ప్రాంతం నుంచి చైనా సైన్యం వెనక్కి వెళ్లింది. వివాదాస్పద ప్రాంతం నుంచి కిలోమీటర్‌ వరకు చైనా పీపుల్స్‌ ఆర్మీ వెనక్కివెళ్లింది. వివాదస్పద ప్రాంతంలో టెంట్‌లు, వాహనాలను ప్రభుత్వం తొలగించింది. నిజానికి చెప్పాలంటే భారత్‌ది పెద్ద విజయమేనని చెప్పాలి. ఎందుకంటే ఇంతకు ముందు కూడా చైనా ఇలాగే వేషాలువేసి చివరకు తొకిముడిచింది. ఇప్పుడు కూడా మేకబోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ సరిహద్దుల్లో తిష్టవేసింది. తీరా తొకముడిచి వెనక్కి వెళ్లిపోయింది. భారత్‌ సైన్యం జూన్‌ 15న వీరోచితంగా పోరాడటం, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంపై చ ఐనాకు చెందిన 59 యాప్‌ లను నిషేధించడం,చైనా కంపెనీలకు ప్రాజెక్టులను రాష్ట్రాలు రద్దు చేసుకోవడం, అమెరికా, ఫ్రాన్స్‌, రష్యా భారత్‌కు అండగా నిలవడం, ఇవన్నీ చూసి చైనా ఇక తన ఆటలు ఏ మాత్రం సాగవని అర్థం చేసుకున్నట్లు తెలుస్తోంది.

భారత్‌ - చైనా రెండు దేశాల మధ్య కమాండర్‌ స్థాయి చర్చలు జరిగాయి. అందులో రెండు దేశాలు సైన్యాన్ని వెనక్కి పంపుకోవాలని నిర్ణయించాయి. అయితే ఇప్పటికీ వాస్తవాధీన రేఖ వెంట భారీగా ఆయుధ సామాగ్రి అలాగే ఉందని తెలుస్తోంది. గాల్వన్‌ నది వెంట ఉన్న ఆ ఆయుధ సామాగ్రిపై భారత సైన్యం ఓ కన్నెసి ఉంచుతోంది.

ఇక చైనా యాప్స్‌ బ్యాన్‌తో చైనా కంపెనీలు వేల కోట్లు నష్టపోవడంతో చైనా ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీనికి తోడు మొన్న ప్రధాని నరేంద్రమోదీ లడఖ్‌ పర్యటన సందర్భంగా గాయపడ్డ సైనికునలు సైతం పరామర్శించారు. దీంతో చైనాకు షాకిచ్చినట్లయింది. భారత్‌తో పెట్టుకుంటే ఆర్థికంగా, అన్ని రకాలుగా ప్రమాదమేనని భావించిన సైనా.. 48 గంటల్లో రకరకాలుగా భారత్‌తో సంప్రదింపులు, చర్చలు జరిపారు. చివరకు తోకముడిచి వెనక్కి వెళ్లిపోయారు.

Next Story