అన్నీ చెబుతాం.. మిగిలింది అదొక్కటే: చైనా
By అంజి Published on 28 March 2020 8:01 AM IST
హైదరాబాద్: మహమ్మారి కరోనా వైరస్.. ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. అన్ని దేశాల్లోనూ కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. మృతుల సంఖ్య ఇప్పటికే 20 వేలు దాటింది.
ఈనాడు దినపత్రిక కథనం ప్రకారం.. ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు చైనా, అమెరికాలు ఏకం కావాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. కరోనా వైరస్ గురించి తమ అనుభవాలను పంచుకోవటానికి సిద్దంగా ఉన్నామని జిన్‌పింగ్ ప్రకటించారు. సినో-అమెరికా మధ్య సంబంధాలు అతి కీలక మలుపులో ఉన్నాయని ఆయన వ్యాఖ్యనించారు. పరస్పర సహకారం వల్ల ఇరు దేశాలు లాభపడే అవకాశం ఉందన్నారు. అయితే మిగిలిన అవకాశం కూడా అదొక్కటే అని జిన్‌పింగ్ అభిప్రాయపడ్డారు.
గత కొన్ని సంవత్సరాలుగా చైనా-అమెరికా మధ్య ట్రేడ్ వార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అసలు కరోనా ఆవిర్భావం అమెరికా సైన్యం చైనాలో అడుగుపెట్టడం వల్లే అంటూ ఓ చైనా ఉన్నతాధికారి అనుమానం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, సెక్రటరీ మైక్ పాంపియోలు కరోనాను చైనా వైరస్ అంటూ పలు చోట్ల మాట్లాడారు. దీంతో ఇరు దేశాల మధ్య అగ్గి రాజుకున్నట్లైంది.
Also Read: బిగ్‌బ్రేకింగ్: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
ప్రపంచ వ్యాప్తంగా 5,40,000కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మృతుల సంఖ్య 25 వేలకు చేరుకుంటోంది. కరోనా వైరస్ విజృంభణతో ప్రపంచ దేశాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నాయి. అయితే జిన్‌పింగ్ చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణం కలిగేందుకు ఆస్కారం ఉందని పలువురు అంటున్నారు.
Also Read: ‘నాన్న ఇంటికి రావొద్దు..’ అంటూ తండ్రికి చిన్నారి లేఖ