చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేత
By రాణి Published on 18 March 2020 2:37 PM IST
భారత్ కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. తాజాగా ఈ వైరస్ బాధితుల సంఖ్య 150కి చేరువలో ఉండగా..ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా 7200 మందికి పైగా మృతి చెందారు. కరోనాను కట్టడి చేయాలంటే ఎక్కువగా ఎవరినీ తాకకుండా ఉండరాదని ప్రభుత్వాలు సూచనలు చేస్తున్నాయి. ఈ మేరకు దాదాపు అన్ని సంస్థలు మూతపడ్డాయి. దేవాలయాలను కూడా ఒక్కొక్కటిగా మూసివేస్తున్నారు. కాణిపాకం ఆలయం మూతపడగా..తిరుమలలో కరోనా దృష్ట్యా భక్తుల రద్దీ గణనీయంగా తగ్గుతోంది. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాలన్నింటినీ మూసివేశారు. షిరిడికి రావాలని ఇప్పటికే ప్రయాణమయ్యేందుకు సిద్ధమైన వారంతా..సాయిబాబా ఆలయాన్ని మూసివేయడంతో ప్రయాణాలను రద్దు చేసుకున్నారు.
Also Read : కరోనా వచ్చి ఒకడేడుస్తుంటే “చలోనా” అని ఒకడు ఆనందపడుతున్నాడు
ఈ నేపథ్యంలో కరోనా ఎఫెక్ట్ ఇప్పుడు చిలుకూరు బాలాజీ ఆలయంపై కూడా పడింది. చిలుకూరుకు నిత్యం వందల సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటుంటారు. ప్రభుత్వం ఎక్కడా గుంపులు గుంపులుగా తిరగవద్దని సూచించిన నేపథ్యంలో..గురువారం నుంచి చిలుకూరు ఆలయాన్ని కూడా మూసివేస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ వెల్లడించారు. ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకూ చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేత కొనసాగుతుందని అర్చకులు తెలిపారు. అయితే..స్వామివారికి ఆరాధన, నైవేద్య కార్యక్రమాలు మాత్రం అర్చకుల సమక్షంలో నిర్వహిస్తామని తెలిపారు. భక్తులకు మాత్రం గుడికి వచ్చేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
Also Read : కరోనా ఎఫెక్ట్: ఆ పరీక్షలన్నీ రద్దు..!