కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. విజయవాడ నగర శివారులోని నల్లగుంట్ల గ్రామంలో కిడ్నాప్‌కు గురైన చిన్నారి హత్యకు గురైంది. పక్కింట్లోనే చిన్నారి ద్వారక (8)ను హత్య చేశారు. ఆదివారం సాయంత్రం ఇంటి దగ్గర ఆడుకుంటూ చిన్నారి కనిపించకుండా పోయింది. దీంతో వెంటనే చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మేకల ప్రకాష్‌ అనే దుండగుడు పాపను చంపేసి ఇంట్లోని మూటలో ఉంచాడు. నిందితుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.