బ్రేకింగ్: మావోయిస్టుల బీభత్సం...9 వాహనాలకు నిప్పు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 Nov 2019 6:01 PM IST
ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని దంతెవాడలో మావోయిస్టులు రెచ్చపోయారు. జేసీబీ, డంపర్ సహా 9 వాహనాలకు మావోయిస్టులు నిప్పంటించారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు గతంలో కూడా ఇలాంటి ఎన్నో ఘటనలకు పాల్పడ్డారు. రహదారి పనులను నిమిత్తం ఏర్పాటు చేసిన వాహనాలకు నిప్పంటించి బీభత్సం సృష్టించారు. మావోయిస్టుల దుశ్చర్యతో సుమారు మూడు కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. వాహనాలకు నిప్పంటించిన మావోయిస్టులు...అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దంతెవాడ ప్రాంతంలో మావోల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story