ఐపీఎల్ వాయిదా ప‌డ‌డంతో.. చెన్నై సూప‌ర్ కింగ్స్ కి రూ.200కోట్ల న‌ష్టం..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 April 2020 1:37 PM GMT
ఐపీఎల్ వాయిదా ప‌డ‌డంతో.. చెన్నై సూప‌ర్ కింగ్స్ కి రూ.200కోట్ల న‌ష్టం..!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌) 2008లో ప్రారంభ‌మైంది. ఇప్ప‌టి వ‌ర‌కు దిగ్విజ‌యంగా 12 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. కాగా ఐపీఎల్ ప్ర‌తి సీజ‌న్‌లో క‌నీసం ప్లేఆఫ్ చేరిన ఏకైక జ‌ట్టు చెన్నై సూప‌ర్ కింగ్స్. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సార్లు విజేత‌గా నిలిచింది. కాగా.. ఈ ఏడాది ఐపీఎల్-13వ సీజ‌న్ వాయిదా ప‌డ‌డంతో చెన్నై సూప‌ర్ కింగ్స్ సుమారు రూ.200 కోట్లు న‌ష్ట‌పోయింది.

ఐపీఎల్ 2020 సీజ‌న్ ఈ ఏడాది మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సి ఉండ‌గా.. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఏప్రిల్ 15కు వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే.. అప్ప‌టికి ప‌రిస్థితులు అదుపులోకి వ‌చ్చే సూచ‌న‌లు కనిపించ‌డం లేదు. దీంతో టోర్నీ జ‌ర‌గ‌డం పై సందిగ్థ‌త నెల‌కొంది.

ఇదిలా ఉంటే.. ఐపీఎల్ టోర్నీ వాయిదా ప‌డ‌డంతో చెన్నై సూప‌ర్‌కింగ్స్ మార్కెట్ విలువ అనూహ్యంగా ప‌డిపోయింది. సీఎస్‌కే మార్కెట్ విలువ రూ.1000 కోట్లు ఉండ‌డగా.. రూ.800 కోట్ల‌కు ప‌డిపోయిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. దీంతో దాదాపు రూ.200కోట్లు చెన్నై న‌ష్ట‌పోయింద‌ట‌.

ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్ 12 సీజ‌న్లు జ‌ర‌గ‌గా.. ముంబాయి ఇండియ‌న్స్ నాలుగు సార్లు, చెన్నై సూప‌ర్ కింగ్స్ మూడు సార్లు టైటిల్ విజేత‌గా నిలిచాయి. వీటి త‌రువాత కోల్‌క‌త్తా నైట్ రైడ‌ర్స్ రెండు సార్లు ఐపీఎల్ క‌ప్ కొట్టింది. ఇక 2019లో వెలువ‌డిన లెక్క‌ల ప్ర‌కారం ముంబాయి ఇండియ‌న్స్ బ్రాండ్ వాల్యూ రూ.809కోట్లు కాగా.. చెన్నై సూప‌ర్‌కింగ్స్ రూ.732కోట్లు, కోల్‌క‌త్తా నెట్ రైడ‌ర్స్ రూ.629 కోట్ల‌తో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.

Next Story
Share it