ప్రేయ‌సి కోసం గోడ దూకిన టీమ్ఇండియా క్రికెట‌ర్‌..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 April 2020 7:59 AM GMT
ప్రేయ‌సి కోసం గోడ దూకిన టీమ్ఇండియా క్రికెట‌ర్‌..

తెలుగు క్రికెట‌ర్ హ‌నుమ విహారి ప్రేమ క‌థ.. సినిమాకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది. ప్రేయ‌సి కోసం అర్థ‌రాత్రి దాటాక.. ఆమె ఇంటికి వెళ్లి గోడ దూక‌డం లాంటివి చాలా చేశాడంట‌. చూడ‌డ‌గానికి సిగ్గ‌రిగా క‌నిపించే ఈ రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ ఇలా చేశాడంటే న‌మ్మ‌డం కొంచెం క‌ష్ట‌మే.. అయితే ఈ విష‌యాన్ని 'క్రిక్‌బ‌జ్' కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు ఈ తెలుగు క్రికెట‌ర్‌.

ఓ రోజు నేను నా స్నేహితుడు క‌లిసి అర్థ‌రాత్రి దాకా హైద‌రాబాద్‌లోని ఓ క్ల‌బ్‌లో ఉన్నాం. ఆ త‌రువాత లాంగ్ డ్రైవ్‌కు వెళ‌దామ‌నుకున్నాం. అయితే.. ఆ స‌మ‌యంలో నాకు ప్రీతిని చూడాల‌నిపించింది. త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి ప్రీతి వ‌రంగ‌ల్‌లో ఉంటుంది. హైద‌రాబాద్ నుంచి సుమారు 3గంట‌ల దూరం. అంతే ఇంకా ఏమీం ఆలోచించ‌లేదు. రాత్రి ఒంటిగంట‌కు కారులో ఫ్రెండ్‌తో క‌లిసి బ‌య‌లు దేరా. ఒక చేత్తో బిర్యానీ, మ‌రో చేత్తో సాంబార్ అన్నం ప‌ట్టుకుని నా ఫ్రెండ్ కూర్చున్నాడు. అలా వ‌రంగ‌ల్‌కు వెళ్లాం. అక్క‌డికి వెళ్లాక చూస్తే ప్రీతి ఇంటి గేటుకు తాళం వేసి ఉంది. దీంతో త‌ను బ‌య‌టికి రాలేని ప‌రిస్థితి. ఎలాగైన స‌రే ఆమెను క‌ల‌వాని అనుకున్నా. వాళ్ల ఇంట్లో వాళ్లు చూస్తే గోడ దూకి పారిపోవాల‌ని అనుకున్నా. ఎందుకైనా మంచిద‌ని నా స్నేహితుడిని డ్రైవ‌ర్ సీట్లో కూర్చొని కారు స్టార్ చేసి రెడీగా ఉన్నాడు. నేను గేటు దూకి గోడ ఎక్కి ప్రీతిని క‌లిశా. అయితే.. అదృష్ట వ‌శాత్తు ఎవ‌రూ చూడ‌లేరు. అని నాటి ఘ‌ట‌న‌ను గుర్తు చేసుకున్నాడు. కొన్ని రోజుల‌కే ఈ ప్రేమ‌క‌థ సుఖాంత‌మైంది. కులాంత‌ర వివాహానికి ప్రీతి త‌ల్లిదండ్రులు మొద‌ట ఒప్పుకోలేదు. అనంత‌రం వారిని ఒప్పించిన విహారి, ప్రీతిని గ‌త సంవ‌త్స‌రం మేలో పెళ్లి చేసుకున్నాడు.

Next Story
Share it