వాటిని నిషేదించిన ఈసీబీ.. ఇక పై ఆట‌గాళ్లు అవి ధ‌రించ‌కూడ‌దు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 March 2020 4:07 PM GMT
వాటిని నిషేదించిన ఈసీబీ.. ఇక పై ఆట‌గాళ్లు అవి ధ‌రించ‌కూడ‌దు

క్రికెట్‌లో అవినీతిని తావులేకుండా ఉండేందుకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. అవినీతి నిరోధక నిబంధనలను మరింత కఠినం చేసింది. ఇక నుంచి దేశవాళీ మ్యాచ్‌లు జ‌రుగుతున్న‌ప్పుడు ఆట‌గాళ్లు స్మార్ట్‌ వాచ్‌లను ధ‌రించ‌కూడ‌ద‌ని ఆదేశాలు జారీ చేసింది. స్మార్ట్‌ వాచ్‌లు ఉపయోగించడం వలన సమాచార మార్పిడి జరిగే అవకాశం ఉండటంతో ఈసీబీ ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రతి ప్రత్యక్ష ప్రసారం జరిగే మ్యాచ్‌ల్లో ఈ నిషేధం ఉంటున్నట్లు తెలిపింది. అయితే లైవ్‌ టెలీకాస్ట్‌ కానీ మ్యాచ్‌ల్లో డ్రెస్సింగ్‌ రూమ్‌, డగౌట్‌లలో ఆటగాళ్లు స్మార్ట్‌ వాచ్‌లు ధరించవచ్చని పేర్కొంది. కౌంటీ చాంపియన్‌ షిప్‌-2019లో భాగంగా మైదానంలో ఉండగానే స్మార్ట్‌ వాచ్‌తో తాను ఇంగ్లాండ్ జాతీయ జ‌ట్టుకు

ఎంపికైన విషయం తెలిసిందని లాంక్‌షైర్‌ స్పిన్నర్‌ పార్కిన్సన్‌ పేర్కొన్నాడు.

దీనిపై విచార‌ణ జ‌రిపిన ఈసీబీ ముఖ్య‌మైన మ్యాచుల్లో స్మార్ట్‌వాచ్‌ల‌ను ధ‌రించ‌కుండా నిషేదించింది. మ‌రోవైపు అంత‌ర్జాతీయ మ్యాచుల్లో స్మార్ట్ వాచ్‌ల‌పై ఇప్ప‌టికే నిషేదం కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే.

Next Story