షాద్‌నగర్‌లో చిరుత పులి హల్‌చల్‌.. భయపడుతున్న స్థానికులు

By అంజి  Published on  20 Jan 2020 4:04 AM GMT
షాద్‌నగర్‌లో చిరుత పులి హల్‌చల్‌.. భయపడుతున్న స్థానికులు

రంగారెడ్డి‌: నగర శివారులోని షాద్‌నగర్‌లో చిరుత పులి హల్‌చల్‌ చేసింది. పులిని చూసిన కొందరు గట్టిగా కేకలు వేశారు. దీంతో పటేల్‌ రోడ్డులోని మన్నే విజయ్‌ కుమార్‌ ఇంటి మిద్దె ఎక్కింది. అనంతరం మిద్దెపై పులి తీరిగ్గా పడుకుంది. పులి రావడంతో కాలనీ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పులి దాడి చేస్తుందేమోనని స్థానికులు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటి చుట్టూ 100 మీటర్ల వరకు పోలీసులు ఎవరిని అనుమతించడం లేదు. పులిని పట్టుకునేందుకు అటవీశాఖ సిబ్బంది అక్కడికి చేరుకున్నట్లు సమాచారం.

cheetah halchal in Hyderabad cheetah halchal in Hyderabad

Next Story