మరోసారి చెడ్డిగ్యాంగ్ హల్‌చల్..!
By Medi SamratPublished on : 22 Nov 2019 2:56 PM IST

ముఖ్యాంశాలు
- 70 వేల నగదు, 15 తులాల బంగారు ఆభరణాలు చోరీ
- త నెల 25న కూడా నాలుగు ఇళ్లలో చోరీ
- ఆందోళనలో గ్రామస్థులు
మరోసారి చెడ్డిగ్యాంగ్ హల్‌చల్ చేసింది. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూరు గ్రామంలో చెడ్డిగ్యాంగ్ అలజడి సృష్టించింది. వరుసగా రెండు ఇళ్లో చోరీకి పాల్పడింది. ఈ చోరీలలో రూ. 70 వేల నగదు, 15 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. గత నెల 25న కూడా నాలుగు ఇళ్లలో చోరీకి పాల్పడింది. దీంతో గ్రామస్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గత నెలలో జరిగిన దోపిడి కేసును పోలీసులు చేధించక ముందే.. చెడ్డిగ్యాంగ్ మరోసారి హల్‌చల్ చేయడంతో గ్రామస్థులు ఆందోళనకు గురవుతున్నారు.
Next Story