చర్లపల్లి జైలులో ఖైదీ మృతి

By సుభాష్  Published on  2 April 2020 7:59 AM GMT
చర్లపల్లి జైలులో ఖైదీ మృతి

చర్లపల్లి జైలులో ఓ ఖైదీ మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్‌లోని అరాక్‌ జిల్లాకు చెందిన వాజీద్‌ అలీ (56)కు మార్చి 31న గుండెపోటు వచ్చింది. గమనించిన జైలు అధికారులు వెంటనే చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయమై మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా వారు ఇప్పట్లో వచ్చే అవకాశం లేకపోవడంతో మృతదేహాన్ని మార్చురీలో పెట్టినట్లు జైలర్‌ రామకృష్ణ తెలిపారు.

అయితే వాజీద్‌ అలీ ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి జహీరాబాద్‌లో కూలీ పనులు చేసుకునేవాడని జైలు అధికారులు తెలిపారు. ఏడాది కిందట ఓ బాలికపై అత్యాచారం కేసులో జీవిత ఖైదు పడటంతో చర్లపల్లి జైలుకు తరలించారు.

Next Story
Share it