చంద్రబాబువి ఊసరవెల్లి రాజకీయాలు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Oct 2019 12:24 PM ISTగుంటూరు: బీజేపీలోకి త్వరలోనే ఊహించని విధంగా చేరికలు జరగనున్నాయన్నారు బీజేపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు ఇంకా ఊసరవెల్లి రాజకీయాలు మానుకోలేదని విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉంటే ఒకలా.. లేకపోతే మరోలా బెదరింపులు చేస్తున్నారని విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఏపీలో జర్నలిస్ట్ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సమాజంలో కష్టపడి పని చేసే జర్నలిస్టుకుల రక్షణ లేకుండా పోతోందని.. వరుసగా జర్నలిస్టుపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. వర్ల రామయ్య నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. పోలీస్ శాఖపై వర్ల రామయ్య కామెంట్లను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలీస్ శాఖకు వర్ల రామయ్య వెంటనే క్షమాపణ చెప్పాలని విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు.
Next Story