Fact Check : పీఎం కన్యా ఆయూష్ యోజన కింద ఒక్కో బాలికకు 2000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుందా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 Sep 2020 6:59 AM GMTకేంద్ర ప్రభుత్వం ఒక్కో బాలికకు 2000 రూపాయలు ఇవ్వాలని భావిస్తోంది అంటూ ఓ మెసేజీ వైరల్ అవుతోంది. ప్రధాన మంత్రి కన్యా ఆయుష్ యోజన సంక్షేమ పథకం (పిఎం కన్య ఆయుష్ యోజన) కింద బాలికకు 2000 రూపాయలు ఇస్తోందని మెసేజీలో చెప్పుకొచ్చారు. ఈ స్కీమ్ కింద 2000 రూపాయలు ఒక్కో బాలిక అకౌంట్ లోకి డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వమే ట్రాన్స్ఫర్ చేయనుందట..!
యూట్యూబ్ లో కూడా ఈ వీడియో సర్క్యులేషన్ లో ఉంది. ఓ మహిళ కన్నడలో ఈ విషయంపై మాట్లాడుతూ కనిపించింది.. అందులో బాలికలు ఉన్న ఫోటోలను కూడా చేర్చారు. ఫిబ్రవరి 2015న ఈ వీడియోను పోస్టు చేశారు.
ఈ మెసేజీ వాట్సప్ లో కూడా వైరల్ అవుతోంది:
ఈ పథకానికి యోగ్యులు కావాలంటే:
అమ్మాయిలు భారతీయులు అయ్యుండాలి
ఆధార్ కార్డు తప్పనిసరిగా
ఉండాలి బ్యాంకు అకౌంట్ నెంబర్ కూడా ఉండాలి
మొబైల్ నెంబర్
బర్త్ సర్టిఫికేట్
18 సంవత్సరాల వయసు ఉండాలి
మిగిలిన సమాచారం తెలుసుకోడానికి దగ్గరే ఉన్న పోస్టు ఆఫీసును సంప్రదించండి.
ఇలా మెసేజీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
నిజ నిర్ధారణ:
ప్రధాన మంత్రి కన్య ఆయుష్ యోజన కింద అమ్మాయిలకు 2000 రూపాయలు ఇస్తున్నారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'. అలాంటి పథకం అన్నదే లేదు.
గతంలో కూడా పిఎం కళ్యాణ్ ఆశీర్వాద్ యోజన కింద ప్రభుత్వం ప్రతి ఒక్క ఆడపిల్లకు 2000 రూపాయలు ఇస్తోందంటూ వాట్సప్ లో మెసేజీ వైరల్ అయింది. ఇది కూడా తప్పుడు సమాచారమే..! కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పి ప్రజలను మోసం చేయడానికి చాలా ఫేక్ మెసేజీలు లాక్ డౌన్ సమయంలో వైరల్ అయ్యాయి.
Ministry of Women and Child Development కూడా అలాంటి స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం తీసుకుని రాలేదని అధికారిక వెబ్సైట్ ను చూస్తే మనకు అర్థం అవుతుంది.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా అలాంటి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుని రాలేదని.. మోసపోకండి అంటూ తెలిపింది. బోగస్ పథకాల మాయలో పడేసి డబ్బులను కొందరు సంపాదిస్తూ ఉన్నారని కూడా తెలిపింది. ఇలాంటి బోగస్ పథకాల్లో రిజిస్టర్ కాకండి అని పోస్టు చేసింది.
Claim: The government is providing ₹2000 to every girl child under Pradhan Mantri Kanya Ayush Yojana. #PIBFactCheck: This claim is #Fake. There is no such scheme under the central government. Please beware of such bogus schemes! pic.twitter.com/dYLWHul3Kx
— PIB Fact Check (@PIBFactCheck) September 5, 2020
పిఎం కన్యా ఆయుష్ యోజన కింద ఒక్కో బాలికకు 2000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుందంటూ వైరల్ అవుతున్న పోస్టు 'అబద్ధం'.