క్రీడా రత్నాలకు.. కీర్తి కిరీటాలు..!

By అంజి  Published on  25 Jan 2020 4:17 PM GMT
క్రీడా రత్నాలకు.. కీర్తి కిరీటాలు..!

ఢిల్లీ: దేశానికి చెందిన అత్యున్నత పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం శనివారం రాత్రి ప్రకటించింది. 71వ రిపబ్లిక్‌ వేడుకల సందర్భంగా.. 2020 సంవత్సరానికిగానూ వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలు చేసిన పలువురిని పద్మ పురస్కారాల కోసం ఎంపిక చేసింది. ఈ సంవత్సరం 141 మందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఇందులో 118 మందికి పద్మశ్రీ పురస్కారాలు, 16 మందికి పద్మ భూషన్‌ పురస్కారాలు, ఏడుగురికి పద్మ విభూషణ్‌ పురస్కారాలు వచ్చాయి. ప్రజా వ్యహహారాలు, విజ్ఞానశాస్త్రం, వాణిజ్యం, ఇంజినీరింగ్‌, సాంఘిక, పరిశ్రమ, సాహిత్యం, విద్య, క్రీడ, ఔషధం, పౌరసేవ తదితర రంగాల్లో చేసిన సేవలకు గాను ఈ పురస్కారాలను భారత ప్రభుత్వం అందిస్తోంది. పలువురికి మరణాంతరం పద్మ పురస్కారాలు దక్కాయి. అందులో బీజేపీ అగ్రనేతలైన అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్‌లు ఉన్నారు. విదేశాలకు చెందిన వారికి కూడా పద్మ అవార్డులు దక్కాయి. ఇద్దరు బ్రెజిల్‌ చెందిన ప్రముఖలు పద్మశ్రీకి ఎంపికయ్యారు.

తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులకు కూడా ఈ పురస్కారాలు దక్కాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎడ్ల గోపాల్‌రావు, దలవాయి చలపతిరావుకు పద్మీ పురస్కారాలు, తెలంగాణ నుంచి పీవీ సింధుకు పద్మభూషన్‌, వ్యవసాయ విభాగంలో చింతల వెంకట్‌ రెడ్డి, ఎడ్యుకేషన్‌ నుంచి విజయసారథి శ్రీభాష్యంకు పద్మ శ్రీ పురస్కారాలు దక్కాయి.

Central govt announcing padma shri awards

చింతల వెంకట్‌ రెడ్డి

2

విజయసారథి శ్రీభాష్యం

3

ఎడ్ల గోపాల్‌రావు

4

దలవాయి చలపతిరావు

పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన ప్రముఖులు..

అబ్దుల్‌ జబ్బార్‌ (మధ్యప్రదేశ్‌) - సామాజిక సేవ

రాధామోహన్‌, సంభవ్‌ సే సంచయ్‌ (ఒడిశా) - సేంద్రియ వ్యవసాయం

జావేద్‌ అహ్మద్‌ తక్ (జమ్మూ కశ్మీర్‌) - దివ్యాంగ బాలల సంక్షేమం

తులసి గౌడ (కర్ణాటక) - సామాజికసేవ, పర్యావరణం

ఉషా కౌమర్‌ (రాజస్థాన్‌) - పారిశుద్ధ్యం

సత్యనారాయణ్‌ (అరుణాచల్‌ప్రదేశ్‌) - సామాజిక సేవ, విద్యా విభాగం

సుందరవర్మ (రాజస్థాన్‌) - పర్యావరణం, అడవుల పెంపకం

పోపట్‌రావ్‌ పవార్‌ (మహారాష్ట్ర) - సామాజిక సేవ, నీటి విభాగం

రవి కన్నన్‌ (అసోం)- వైద్యం, అంకాలజీ విభాగం

జగదీశ్‌ లాల్‌ అహుజా (పంజాబ్‌) - సామాజిక సేవ

అరుణోదయ్‌ మండల్‌ (బంగాల్‌) - వైద్య, ఆరోగ్యం

కుశాల్‌ కన్వర్‌ (అసోం) - పశువైద్యం

ఎస్‌. రామకృష్ణన్‌ (తమిళనాడు)- సామాజిక సేవ, దివ్యాంగుల సంక్షేమం

ట్రినిటీ సయూ (మేఘాలయా) - సేంద్రియ వ్యవసాయం

హరికలా హజబ్బా (కర్ణాటక) - సామాజిక సేవ, విద్యా విభాగం

మహ్మద్‌ షరీఫ్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌) - సామాజిక సేవ

Next Story