భారతీయులపై కేంద్రం సంచలన నిర్ణయం

By సుభాష్  Published on  18 March 2020 12:58 PM GMT
భారతీయులపై కేంద్రం సంచలన నిర్ణయం

ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసినా కరోనా గురించే భయాందోళన. కరోనా ప్రపంచ దేశాలను సైతం భయపెడుతోంది. కరోనా ఎఫెక్ట్‌ తో కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మన దేశంలో కరోనాను కట్టడి చేసేందుకు అన్నివిధాలుగా చర్యలు చేపడుతోంది కేంద్రం. ఇప్పుడు తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఉన్న భారతీయులపై నిషేధం విధించింది. ప్రవాస భారతీయులు భారత్‌లో అడుగుపెట్టకుండా చర్యలు చేపట్టింది. ఈ నిషేధం మార్చి 31 వరకు అమలులో ఉంటుందని పౌర విమానయాన డైరెక్టర్‌ జనరల్‌ తెలిపారు.

కాగా, కరోనాతో ఇప్పటి వరకు భారత్‌లో 147 కేసులు నమోదు కాగా, మంగళవారం ఒక రోజే 18 కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మరణించారు. దీంతో విదేశీయులనే కాకుండా ప్రవాస భారతీయులను కూడా ఇండియాకు రానివ్వకుండా కేంద్రం ఆంక్షలు విధించింది. ఇక అత్యవసరం ఉన్నవారికి కరోనా పరీక్షలు నిర్వహించి నెగిటివ్‌ తేలితేనే అనుమతిస్తారని తెలుస్తోంది. అలాగే గల్ఫ్‌ దేశాల నుంచి భారత్‌కు వచ్చేవారికి 14 రోజుల పాటు క్యారంటైన్‌ను తప్పనిసరి చేసింది.

Next Story