276 మంది భారతీయులకు కరోనా.!

ప్రపంచ వ్యాప్తంగా 276 మంది కరోనా బాధితులు ఉన్నారని పార్లమెంట్‌లో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇరాన్‌లో 255, యూఏఈలో 12, ఇటలీలో 5, శ్రీలంక, హాంగ్‌కాంగ్‌, కువైట్‌లో ఒక్కొ భారతీయుడు కరోనా బారిన పడ్డారు.

Also Read: చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేత

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర తరం అవుతోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. భారత్‌ దేశంలోనూ క్రమ క్రమంగా కరోనా వైరస్‌ విస్తరిస్తోంది. మన దేశంలో కరోనా బాధితుల సంఖ్య ఇప్పటి వరకు 150కి చేరింది. కరోనా సోకి ముగ్గురు మృతి చెందగా 14 మంది దాని నుంచి బయటపడ్డారు. 14 రాష్ట్రాలతో పాటు రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మహహ్మరి కరోనా విస్తరించింది.

ఇక మహారాష్ట్రలో అత్యధికంగా 42 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవగా, కేరళలో 27, ఉత్తరప్రదేశ్‌లో 16, కర్నాటకలో 11, హర్యానాలో 16, ఢిల్లీలో 10, లఢఖ్‌లో 8 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దాదాపు 5,700 మంది పర్యవేక్షణలో ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడి 7,993 మంది మృతి చెందారు. కరోనా బాధితుల సంఖ్య 99,180 మందికి చేరింది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *