కొత్త వ్యూహాలు రచిస్తా..!

By అంజి  Published on  1 Jan 2020 8:40 AM GMT
కొత్త వ్యూహాలు రచిస్తా..!

ఢిల్లీ: పాక్‌ సీమాంతర ఉగ్రవాదాన్ని అణిచివేయడమే తన టాస్క్‌ అని బిపిన్‌ రావత్‌ అన్నారు. సీడీఎస్‌ చీఫ్‌గా బిపిన్‌ రావత్‌ బాధ్యతలు చేపట్టారు. రాజకీయాలకు దూరంగా ఉంటామని రావత్‌ పేర్కొన్నారు.

త్రివధ దళాలన్ని ఒక బృందంగా పనిచేస్తూ.. దేశ సమగ్రత, భద్రతను మానవ, ఆయుధ వనరులతో కాపాడతామన్నారు. ఈ సందర్భంగా పాక్‌కు గట్టి హెచ్చరికలు చేశారు. ఉగ్రవాద చర్యలు మానుకోకుంటే దాడులు తప్పవని వార్నింగ్‌ ఇచ్చారు. వార్‌ మెమోరియల్‌లో అమరులకు నివాళులు అర్పించారు. అనంతరం భారత తొలి త్రివధ దళాదిపతిగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మూడు విభాగాలకు చెందిన సైనికులు పాల్గొన్నారు.

28వ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన నరవాణేకు బిపిన్‌ రావత్‌ అభినందనలు తెలిపారు. రావత్‌ మూడేళ్ల పాటు ఈ పదవీలో కొనసాగనున్నారు. 1978 డిసెంబర్‌లో రావత్‌ ఆర్మీ చేరారు. 2017 జనవరి 1 నుంచి 2019 డిసెంబర్‌ 31 వరకు ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. మూడు విభాగాలు ఓ జట్టుగా పని చేయాలని బిపిన్‌ రావత్‌ అన్నారు. త్రివిధ దళాల అధిపతిగా కొత్త వ్యూహాలు రచిస్తానని బిపిన్‌ రావత్‌ పేర్కొన్నారు.

చీఫ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌, త్రివిధ దళాల రక్షణ శాఖకు సంబంధించి బిపిన్‌ రావత్‌ ప్రధాన సలహాదారుగా వ్యవరిస్తారు. సహకార సేవలు, ట్రైనింగ్, ఆపరేషన్స్‌, కమ్యూనికేషన్స్‌ పలు రకాల వాటిలో త్రివిధ దళాలను సమన్వయం చేస్తారు.

Next Story