బిగ్‌బ్రేకింగ్ : సీఎం జగన్.. కోర్టుకు హాజరు కావల్సిందే..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Jan 2020 3:34 PM ISTఏపీ సీఎం జగన్‌కు గట్టి షాక్ తగిలింది. క్విడ్ ప్రో కో కేసులో ఏపీ సీఎం జగన్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడం కుదరదని.. వచ్చే శుక్రవారం, జనవరి 10న కోర్టుకు హాజరు కావాల్సిందేనని సీబీఐ కోర్టు తెలిపింది. వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇస్తే సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని గతంలో సీబీఐ పేర్కొంది.
అయితే.. ఏపీలో రెవెన్యూ అంశాలను చెప్పి వాస్తవాలను పక్కదారి పట్టించేందుకు చూస్తున్నారని సీబీఐ తెలిపింది. సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న సీబీఐ.. ఏపీ లో రెవెన్యూ లోటనేది వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇచ్చే కారణం కాదని సీబీఐ తెలిపింది. అలాగే.. విజయవాడ నుంచి వారానికోసారి రావడం కష్టం కాదని సీబీఐ పేర్కొంది.
ఆరు నెలల క్రితం ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్.. అప్పటి నుండి నేటి వరకూ 8 వాయిదాలకు హాజరు కాలేదు. సీఎం జగన్ తరపు న్యాయవాదులు కోర్టు హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఇక ఈ కేసులో ఏ1, ఏ2 లు గా ఉన్న సీఎం జగన్, విజయసాయి రెడ్డిలు కోర్టుకు హాజరు కావాల్సిందేనని సీబీఐ అనడంతో.. జగన్ కోర్టుకు హాజరు విషయంలో ఎటువంటి అడుగులు వేయనున్నారో వేచి చూడాల్సిందే మరి..!