చాలా బాధ్యతలు ఉన్నాయి...మినహాయింపు ఇవ్వండి - సీఎం వైఎస్ జగన్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 Oct 2019 5:12 PM ISTహైదరాబాద్ : ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన పిటిషన్ పై సీబీఐ కోర్ట్‌లో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేసిన సమయంలో సీబీఐ అడ్వొకేట్ వాడిన భాషపై జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సంబంధంలేని అంశాలను సీబీఐ తన కౌంటర్‌లో ప్రస్తావించిందన్నారు. ఊహాజనిత ఆరోపణలకు సంబంధంలేదన్నారు. ఏపీ ప్రయోజనాల కోసమే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతున్నట్లు చెప్పారు. తన క్లైంట్ హాజరు కాకపోతే..విచారణలో జాప్యం ఎలా జరుగుతుందో సీబీఐ చెప్పాలన్నారు జగన్ తరపు లాయర్.
ఆరేళ్లలో ఏనాడు కేసు వాయిదా కోరలేదు..స్టే కూడా కోరలేదన్నారు.
పాదయాత్ర సమయంలో వ్యక్తిగత మినహాయింపు కోరితే...రాజకీయ అవసరాల కోసం ఇవ్వలేమని హైకోర్ట్ చెప్పిందని జగన్ గుర్తు చేశారు. సీఎం రాజ్యాంగ బద్ధమైన పాలన చేయాల్సిన అవసరం తనపై ఉందని జగన్ చెప్పారు. సాక్షులను ప్రభావితం చేసినట్లు ఆరేళ్లలో ఒక్క ఆరోపణ అయినా నిరూపించగలిగారా అని సీబీఐని జగన్ ప్రశ్నించారు. అయితే..వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ కోర్ట్ ను కోరింది. ఇరు వర్గాల వాదనలు విన్న సీబీఐ న్యాయస్ధానం..తీర్పును నవంబర్ 1కి వాయిదా వేసింది.