ముఖ్యాంశాలు

  • దేశ వ్యాప్తంగా సోదాలకు దిగిన సీబీఐ
  • హైదరాబాద్ లోని ఆంధ్రాబ్యాంక్ లో కూడా సోదాలు
  • రూ.7వేల కోట్ల కుంభకోణానికి సంబంధించి సోదాలు చేస్తున్నట్లు సమాచారం

దేశ వ్యాప్తంగా 169 చోట్ల సీబీఐ ఏకకాలంలో దాడులకు దిగింది. ఆంధ్రప్రదేశ్‌, చండీగఢ్‌, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, కర్ణాటక, కేరళ, మధ్య ప్రదేశ్‌, మహారాష్ట్ర, పంజాబ్ , తమిళనాడు, తెలంగాణ, యూపీ, ఉత్తరాఖండ్, దాద్రానగర్ హైవేలిలో సీబీఐ ఏకకాలంలో సోదాలకు దిగింది. రూ.7వేల కోట్ల కుంభకోణానికి సంబంధించి సీబీఐ పక్కా ఆధారాలతో సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు..బోపాల్ లో కూడా పెద్ద ఎత్తున సోదాలు చేస్తున్నట్లు సమాచారం.

ఆంధ్ర బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఎస్‌బీఐ, అలహాబాద్ బ్యాంక్, కెనరా బ్యాంక్, దేనా బ్యాంక్, పంజాబ్ & సింధ్ బ్యాంక్, పిఎన్‌బీ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడిబిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల్లో దేశ వ్యాప్తంగా సీబీఐ అధికారులు మూకుమ్మడి సోదాలకు దిగారు.

ఢిల్లీ, గుర్గావ్, చండీగఢ్, లూధియానా, డెహ్రాడూన్, నోయిడా, బారామతి, ముంబై, థానే, సిల్వాస్సా, కల్యాణ్, అమృత్సర్, ఫరీదాబాద్, బెంగళూరు, తిరుపూర్, చెన్నై, మదురై, క్విలాన్, కొచ్చిన్, భవత్నగ్ కాన్పూర్, ఘజియాబాద్, వారణాసి, చందౌలి, భటిండా, గురుదాస్‌పూర్, మొరెనా, కోల్‌కతా, పాట్నా, కృష్ణ మరియు హైదరాబాద్ నగరాల్లో భారీ ఎత్తున సోదాలు చేస్తున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.