విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను టీడీపీ నేతలు మంగళవారం కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, అశోక్ బాబు, దీపక్ రెడ్డి, సత్యనారాయణ రాజు, గిడ్డి ఈశ్వరి, మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణరావు, ఇతర నాయకులు ఉన్నారు.