సుశాంత్ ఆత్మహత్య.. సల్మాన్ ఖాన్, కరణ్‌జోహార్ లపై కేసు నమోదు
By తోట వంశీ కుమార్ Published on 17 Jun 2020 5:11 PM ISTబాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్(34) ఆదివారం ముంబైలోని ఆయన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. సుశాంత్ మరణవార్త చాలా మందిని షాక్‌కు గురి చేసింది. ఇదిలా ఉంటే.. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని కోర్టులో సుశాంత్ మృతికి సంబంధించి బాలీవుడ్ ప్రముఖులు కరుణ్ జోహార్, హీరో సల్మాన్ ఖాన్, నిర్మాత ఏక్తా కపూర్ తో పాటు మరో నలుగురు వ్యక్తులపై న్యాయవాది సుధీర్ కుమార్ కేసు పెట్టారు. సుశాంత్ ఆత్మహత్యకు బాలీవుడ్‌లోని కొంతమంది ప్రముఖులే కారణమంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు.
దీనిపై ఆయన మీడియాతో మాట్లాడ్లారు. సుశాంత్ ఆత్మహత్యపై నిర్మాత కరణ్ జోహార్, సంజయ్‌లీలా భన్సాలీ, ఏక్తాకపూర్, సల్మాన్ ఖాన్‌తో పాటు మరో 8 మందిపై బిహార్ ముజఫర్ కోర్టులో ఐపీసీ సెక్షన్ 306, 109, 504, 506 సెక్షన్ల కింద పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. సుశాంత్‌ను 7 చిత్రాల నుంచి తొలగించారని, అంతేగాక అతడు నటించిన కొన్ని సినిమాలు విడుదలకానీయలేదని.. అందువల్లే ఒత్తిడికి గురై సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఐసీసీ సెక్షన్ 306(ఆత్మహత్యకు పాల్పడటం), 504(ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం, అవమానించడం) 506(నేర బెదిరింపులకు శిక్ష) ప్రకారం వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరినట్లు ఆయన చెప్పారు.