పశ్చిమగోదావరిలో అదుపు తప్పిన కారు.. ముగ్గురి మృతి
By అంజి
ముఖ్యాంశాలు
- జగన్నాథపురం వద్ద కాల్వలోకి దూసుకెళ్లిన కారు
- కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు మృతి
- కారును బయటకు తీసిన ఫైర్ సిబ్బంది
పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ కారు అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. పొడూరు మండలంలోని జగన్నాథపురం వద్ద బుధవారం తెల్లవారుజామున ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. జగన్నాథపురం బ్రిడ్జి వద్దకు రాగానే కారు అదుపు తప్పింది. బ్రిడ్జి మీది నుంచి కాల్వలోకి పడిపోయింది. ప్రమాదానికి కారణం మితీమీరిన వేగమా.. లేకా కారు నడుపుతున్న వ్యక్తి నిద్రమత్తులో ఉన్నడా అన్నది తెలియాల్సి ఉంది.
స్థానికుల సమాచారం మేరకు అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాల్వలోంచి కారును బయటకు తీశారు. కారులో ముగ్గురు వ్యక్తులు విగతజీవులుగా కనిపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి జరగడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతులు యలమంచిలి మండలం కాజ గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతులు నరసాపురం మండలం మచ్చపురి నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం సంభవించింది.