దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వెళ్తున్న కారు డీవైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. పాల్‌ఘర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబై - అహ్మదాబాద్‌ జాతీయ రహదారిపై ఓ కారు అతివేగంగా వచ్చి డివైడర్‌ను ఢీకొట్టిందని, ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

అయితే క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో అతను మృతి చెందినట్లు పోలీసులు వివరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సుభాష్

.

Next Story