అర్థరాత్రి బీభత్సం.. కారులో మద్యం సీసాలతో..
By సుభాష్ Published on 7 April 2020 4:30 AM GMT
కరోనా మహమ్మారి తీవ్ర అలజడి సృష్టిస్తున్న నేఫథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు ఎవరూ బయటకు రావొద్దంటూ.. లాక్‌డౌన్ ప్రకటించినా కొంతమంది విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. తాజగా ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా వాహనం నడిపి అర్దరాత్రి బీభత్సం సృష్టించాడు.
వివరాళ్లోకెళితే.. TS 09 EA 990 నెంబరు గల వోక్స్‌వాగన్ కారు అర్థరాత్రి ఎన్టీఆర్ గార్డెన్ వద్ద బీభత్సం సృష్టించింది. హిమాయత్ నగర్ నుండి అతి వేగంతో వస్తున్న కారు.. అదుపు తప్పడంతో ప్రమాదం సంభవించినట్లు తెలుస్తుంది. అయితే.. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో కారులో ఉన్న వ్యక్తికి ప్రమాదం తృటిలో తప్పింది. స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
ఇదిలావుంటే.. కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపధ్యంలో దేశ వ్యాపంగా లాక్ డౌన్ అమలవుతున్న దృష్ట్యా.. ఇలా జరగడం పోలీసులను విస్మయానికి గురిచేసింది. కారులో ఉన్న వ్యక్తి మద్యం సేవించి కారు నడిపినట్లుగా తెలుస్తుంది. కారులో మద్యం సీసాలు లభ్యమవడంతో ప్రమాదానికి కారణం.. మద్యం మత్తులో అతివేగంగా కారు నడపడమేనన్న విషయం తెలుస్తుంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.