ఫుల్లుగా మద్యం తాగారు.. అంబులెన్స్ ను ఢీకొట్టారు
By సుభాష్ Published on 21 March 2020 12:11 PM ISTమద్యం నడుపుతూ వాహనాలు నడపవద్దని పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా మార్పు రావడం లేదు. ప్రతి రోజు డ్రంకెన్‌డ్రైవ్ నిర్వహించి ఎన్నో వాహనాలు సీజ్ చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా కొందరు యువకులు అతిగా మద్యం తాగి కారులో వస్తూ ఓ అంబులెన్స్ ను ఢీకొట్టారు.
వివరాల్లోకి వెళితే.. తొమ్మిది మంది యువకులు మన్నెగూడలో జరిగిన ఓ పుట్టిన రోజు వేడుకలో ఫుల్లుగా మద్యం తాగి సరూర్ నగర్‌కు కారులో తిరిగి వస్తుండగా, అతివేగంగా వచ్చి హస్తినాపురంలోని అమ్మ హస్పిటల్ అంబులెన్స్ ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎల్‌బీనగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయాలైన యువకులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సదరు యువకులు ప్రయాణిస్తున్న కారులో మద్యం బాటిళ్లు, చికెన్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. యువుకలు సీటు బెల్ట్ పెట్టుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. అక్కడి సీసీ పుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్‌బీనగర్ నైట్ ఇన్‌చార్జి డీసీపీ యాదగిరి తెలిపారు.