హైదరాబాద్‌లోని  కోఠిలో ఓ వ్యాపారి కిడ్నాప్‌కు గురయ్యాడు. సుల్తాన్‌ బజార్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని కోఠి చౌరస్తాలో ఐదుగురు దుండగులు కారులో వచ్చి రాజీరెడ్డి అనే వ్యాపారిని కిడ్నాప్‌ చేశారు. ఈ మేరకు రాజీరెడ్డి మిత్రుడు సురేందర్‌ డయాల్‌ 100 ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి సుల్తాన్‌ బజార్‌లో గల సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కాంట్రాక్ట్‌ డబ్బుల విషయంలో ఈ దుండగులు కిడ్నాప్‌ చేసినట్లు సుల్తాన్‌ బజార్‌ సీఐ సుబ్బిరామారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. కాగా, కిడ్నాప్‌ చేయడానికి గల కారణాలు, కిడ్నాపర్లను త్వరలో పట్టుకుంటామని ఆయన పేర్కొన్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.