గోల్డ్ ధరలకు మరోసారి రెక్కలొచ్చాయి. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.76.470కి చేరింది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ. 82,580 వద్దకు ఎగబాకింది. కిలో వెండి ధర రూ.94 వేలకు చేరింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానం చుట్టూ ఉన్న అనిశ్చితి నెలకొన్న కారణంగా బంగారం వంటి సురక్షితమైన సాధానాలపై పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలోనూ డాలర్ బలహీనపడటంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ట్రంప్ ధోరణితో దీర్ఘకాలిక వాణిజ్య ఆందోళనల వల్ల పెట్టుబడులు బంగారంవైపునకు మళ్లుతున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమొడిటీస్ సీనియర్ విశ్లేషకులు సౌమిల్ గాంధీ తెలిపారు. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి.