ఇండిగో కొత్త సీఈఓగా విలియం వాల్ష్ నియామకం

దేశీ దిగ్గజ విమానయాన సంస్థ ఇండిగో నూతన సీఈఓగా విలియం వాల్ష్ (విల్లీ) నియమితులయ్యారు.

By -  Knakam Karthik
Published on : 31 March 2026 6:02 PM IST

Business News, IndiGo, WilliamWalsh, AviationNews, New CEO, InterGlobeAviation, IATA, IndiGoCEO

ఇండిగో కొత్త సీఈఓగా విలియం వాల్ష్ నియామకం

దేశీ దిగ్గజ విమానయాన సంస్థ ఇండిగో నూతన సీఈఓగా విలియం వాల్ష్ (విల్లీ) నియమితులయ్యారు. ప్రస్తుత సీఈఓ పీటర్ ఎల్బర్డ్స్ రాజీనామా చేయడంతో, ఆయన స్థానంలో అంతర్జాతీయ విమానయాన రంగంలో అపార అనుభవం ఉన్న వాల్ష్‌ను బోర్డు ఎంపిక చేసింది. ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) డైరెక్టర్ జనరల్‌గా ఉన్న వాల్ష్, గతంలో బ్రిటిష్ ఎయిర్‌వేస్, ఐఏజీ వంటి సంస్థలకు నాయకత్వం వహించారు.

ఐఏటీఏలో ఆయన పదవీకాలం 2026 జూలై 31తో ముగియనుండగా, ఆగస్టు 3వ తేదీ నాటికి ఆయన ఇండిగోలో బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. గతేడాది డిసెంబర్‌లో ఇండిగో ఎదుర్కొన్న సంక్షోభం నేపథ్యంలో ఎల్బర్డ్స్ తప్పుకోగా, ఇప్పుడు వాల్ష్ రాకతో సంస్థను అంతర్జాతీయ స్థాయిలో మరింత బలోపేతం చేయాలని యాజమాన్యం భావిస్తోంది. విమానయాన రంగంలో తనకున్న వ్యూహాత్మక నైపుణ్యంతో ఇండిగో కార్యకలాపాలను, కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరుస్తానని వాల్ష్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.

Next Story