ఇక టీవీల ధరలు కూడా పెరిపోతున్నాయా..?

TV Prices Likely to go up From Next Month.గ్లోబ‌ల్ మార్కెట్లో ఓపెన్ సెల్ ప్యానెళ్ల ధరలు 35 శాతం వరకు పెరుగుతుండ‌డంతో భార‌త్ లో కంపెనీలు టీవీల ధ‌ర‌ల‌ను పెంచేందుకు సిద్ధ‌మ‌య్యాయి.

By Medi Samrat  Published on  12 March 2021 12:51 PM GMT
TV Prices Likely to go up From Next Month

సగటు భారతీయుడికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వస్తువు ఏమిటంటే టీవీ అనే చెప్తాము.. ఇక పాత టీవీలు వెళ్ళిపోయి ఇక ఎల్.ఈ.డీ.లు, ఎల్.సీ.డీ. టీవీలు కొంటూ ఉన్నారు. ఇంట్లో గోడకు తగిలించేస్తే చాలు అన్నట్లుగా స్లిమ్ గా.. అద్భుతమైన పిక్చర్ క్లారిటీ ఉన్న టీవీలు మార్కెట్ లోకి విడుదల కాబోతున్నాయి. అయితే ఏప్రిల్ నెల నుండి భారతదేశంలో టీవీల ధరలు పెరగబోతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతూ ఉన్నాయి.

గ్లోబ‌ల్ మార్కెట్లో ఓపెన్ సెల్ ప్యానెళ్ల ధరలు 35 శాతం వరకు పెరుగుతుండ‌డంతో భార‌త్ లో కంపెనీలు టీవీల ధ‌ర‌ల‌ను పెంచేందుకు సిద్ధ‌మ‌య్యాయి. టీవీల ధరలు ఇప్పటికే కొన్ని కంపెనీలు పెంచేసాయి. ఎల్‌జీ కంపెనీ ధ‌ర‌ల‌ను పెంచ‌గా.. ప్యానసోనిక్, హాయెర్, థామ్సన్ తో పాటు ప‌లు బ్రాండ్లు వ‌చ్చే నెల నుంచి ధ‌ర‌లు పెంచ‌డానికి సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. అంత‌ర్జాతీయంగా ప్యానెల్ ధరలు క్రమం తప్పకుండా పెరుగుతున్నాయ‌ని, ఈ నేప‌థ్యంలోనే తామూ టీవీ ధరలు పెంచక తప్పట్లేద‌ని ప్యానసోనిక్ ఇండియా, సౌత్ ఆసియా సీఈవో మనీశ్ శర్మ మీడియాకు చెప్పారు. టీవీల ధ‌ర‌లు 5 నుంచి 7 శాతం పెరిగే అవకాశం ఉందని తెలిపారు. భారతదేశంలో 32 అంగుళాల టీవీలు అత్య‌ధికంగా అమ్ముడుపోతున్నాయి. వీటి ధరలు రూ.5,000 నుంచి రూ. 6,000 మధ్య పెరిగే అవకాశం ఉంది. ఇక 43 అంగుళాలు, 55 అంగుళాల టీవీల ధరలు కూడా భారీగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి.


Next Story