బంగారం ధర తగ్గుతున్నట్టే..!
Today Gold Prices In India. దేశంలో గడిచిన కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.
By Medi Samrat Published on 12 Jun 2023 5:18 AM GMTదేశంలో గడిచిన కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఇదే ట్రెండ్ కొనసాగుతూ ఉంది. సోమవారం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో మార్పులు కనిపించలేదు. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,650 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,700 గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,550గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,000 వద్ద కొనసాగుతోంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,500 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 60,550 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,500 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,550గా కొనసాగుతోంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,550 లుగా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో వెండి కిలో రూ.79,800 లుగా కొనసాగుతోంది.ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో మార్కెట్లో కిలో వెండి రేటు రూ.74 వేల 500 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు 1955 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ సిల్వర్ రేటు ప్రస్తుతం ఔన్సుకు 24.14 డాలర్లల వద్ద ట్రేడవుతోంది.