తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు

Today gold and silver prices in hyderabad bullion market.బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పు చేర్పులు చోటు చేసుకుంటూనే

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 12 Feb 2021 9:10 AM IST

Today gold and silver prices in hyderabad bullion market

బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పు చేర్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇటీవల పెరుగుతూ వచ్చిన పసిడి ధర తాజా తగ్గుముఖం పట్టింది. శుక్రవారం దేశీయంగా రూ.210 మేర తగ్గింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 48,600 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 46,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,900 ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,960 ఉంది.

అలాగే హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 45,060 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 49,140 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 49,840 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రామలు ధర రూ.48,600 ఉంది.

బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ మార్కెట్‌ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్‌, భౌగోళఙక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలపై పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

వెండి ధరలు..

ఇక దేశీయంగా వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది. శుక్రవారం దేశీయంగా కిలో వెండిపై రూ.1500 మేర తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.72,900 ఉంది. హైదరాబాద్‌లో రూ.72,900 ఉండగా, దేశ రాజధాని ఢిల్లీలో రూ.68,950 ఉంది. ఇక చెన్నైలో రూ.72,900, ముంబైలో 68,950, కోల్‌కతాలో రూ.68,950, బెంగళూరులో రూ.68,800, విజయవాడలో రూ.72,900 ఉంది.







Next Story