ఆర్థిక విషయాల్లో ప్రతి వ్యక్తికి సిబిల్ స్కోర్ చాలా ముఖ్యం. ఇది తక్కువ వడ్డీకే రుణం పొందడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సిబిల్ స్కోర్‌కి సంబంధించి కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఆ నిబంధనలేంటో ఇప్పుడు చూద్దాం..
- కస్టమర్ సిబిల్ స్కోర్‌ను ఆర్థిక సంస్థలు 15 రోజుల్లోగా అప్‌డేట్ చేయాలి.
- ఒక కంపెనీ, కస్టమర్ క్రెడిట్ రిపోర్ట్ తనిఖీ చేయాలంటే.. కస్టమర్‌కు ఆ సమాచారాన్ని కచ్చితంగా అందించాలి. ఎస్‌ఎంఎస్ లేదా ఈ మెయిల్ రూపంలో సమాచారం ఇవ్వాలి.
- క్రెడిట్ అభ్యర్థనను తిరస్కరించిన కంపెనీ.. అందుకు గల కారణాలను కూడా కస్టమర్‌కు తప్పకుండా తెలపాలి.
- ఒక కస్టమర్ డిఫాల్ట్ స్థితికి చేరుకోబోతున్నట్టయితే సంబంధిత సంస్థ ముందుగానే కస్టమర్‌కి తెలియజేయాలి.
- క్రెడిట్ కంపెనీలు గరిష్ఠంగా 30 రోజులలోపు కస్టమర్ ఫిర్యాదులను పరిష్కరించాలి. ఒక వేళ అలా చేయకపోతే రోజుకు రూ.100 చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
- కస్టమర్ పూర్తి క్రెడిట్ నివేదికను ఆయా క్రెడిట్ కంపెనీలు ప్రతి సంవత్సరం వినియోగదారులకు అందించాలి.