డిసెంబర్ 31 లోపు ఈ పనులు పూర్తి చేసేయండి.. లేకపోతే
2023 సంవత్సరానికి గుడ్‌బై చెప్పి 2024వ సంవత్సరానికి వెల్కమ్ చెప్పబోతున్నాం.. వీటితో పాటు పలు పనులు కూడా ఈ నెలాఖరుతో గడువు ముగియనుంది.
By అంజి Published on 25 Dec 2023 10:01 AM IST
డిసెంబర్ 31 లోపు వీటిని పూర్తి చేసేయండి.. లేకపోతే
2023 సంవత్సరానికి గుడ్‌బై చెప్పి 2024వ సంవత్సరానికి వెల్కమ్ చెప్పబోతున్నాం.. వీటితో పాటు పలు పనులు కూడా ఈ నెలాఖరుతో గడువు ముగియనుంది. ఒక వేళ మీరు ఈ ఐదు పనులను పూర్తి చేయకుంటే ఈ రోజే వాటిని పూర్తి చేయండి. లేదంటే నష్టపోయే అవకాశం ఉంది. ఆ ఐదు పనులు ఏంటో ఇప్పుడు చూద్దాం..
డీమ్యాట్ ఖాతా, మ్యూచవల్ ఫండ్ నామినేషన్
మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టినట్లయితే, మీ నామినీ పేరును జోడించడానికి మీకు డిసెంబర్ 31 వరకు మాత్రమే సమయం ఉంది. మీరు ఈ పనిని పూర్తి చేయకపోతే.. మీ మ్యూచవల్ ఫండ్ ఖాతా యాక్టివేట్‌లో ఉండదు.
యూపీఐ ఐడీ బ్లాక్
ఒక సంవత్సరానికిపైగా యాక్టివ్‌గా లేని యూపీ ఐడీలు, నంబర్‌లను యాక్టివేట్ చేయాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. లేదంటే యూపీఐ ఐడీ డీయాక్టివేట్ అవుతుంది.
బ్యాంకు లాకర్ ఒప్పందం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం.. సేఫ్ డిపాజిట్ లాకర్ల కొత్త నిబంధనల ప్రకారం లాకరు కలిగిన ప్రతి ఖాతాదారుడు తమ బ్యాంకుల కొత్త ఒప్పందంపై సంతకం చేయడం తప్పనిసరి. దీనికి చివరి తేదీ డిసెంబర్ 31 వరకు మాత్రమే.
ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు
ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయడానికి చివరి తేదీ జులై 31. అయితే జులై 31 నాటికి ఐటీఆర్ ఫైల్ చేయని కస్టమర్‌లు ఆలస్య రుసుముతో డిసెంబర్ 31 వరకు ఫైల్ చేయవచ్చు. లేదంటే జరిమానా విధించే అవకాశం ఉంది.
అమృత్ కలాష్ స్కీమ్
ఎస్‌బీఐ అమృత కలాష్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంది. ఈ 400 రోజుల ఎఫ్‌డీ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. 7.6 శాతం వడ్డీ ప్రయోజనాన్ని పొందుతారు.
సిమ్‌కార్డ్ కొత్త రూల్స్
సిమ్ కార్డుల జారీకి సంబంధించి డిసెంబరు 31 తర్వాత కొత్త రూల్ రాబోతుంది. ఎలాంటి ఫిజికల్ డాక్యుమెంట్స్ సమర్పించకుండానే డిజిటల్ విధానంలో ఈ-కేవైసీ చేసుకోవచ్చు.