న‌వంబ‌రు నెల‌లో బ్యాంకుల‌కు 10 రోజుల సెల‌వులు

Ten days holidays for banks in November 2022.ఓ వైపు ఆన్‌లైన్ లావాదేవీలు పెరుగుతున్న‌ప్ప‌టికీ ఏదో ఒక ప‌నిపై

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Oct 2022 11:10 AM IST
న‌వంబ‌రు నెల‌లో బ్యాంకుల‌కు 10 రోజుల సెల‌వులు

ఓ వైపు ఆన్‌లైన్ లావాదేవీలు పెరుగుతున్న‌ప్ప‌టికీ ఏదో ఒక ప‌నిపై బ్యాంకుల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉంటుంది. అందుక‌నే నెల‌లో ఏయే రోజుల్లో బ్యాంకుల‌కు సెల‌వులు ఉన్నాయో గ‌మ‌నించుకుంటే మంచింది. దీని వ‌ల్ల బ్యాంకు ప‌నుల‌ను ప్లాన్ చేసుకోవ‌చ్చు. రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ప్ర‌తి నెల బ్యాంకుల సెల‌వుల‌కు సంబంధించిన జాబితా విడుద‌ల చేస్తుంటుంది. న‌వంబర్ నెల సెలవుల జాబితా వచ్చేసింది.

* నవంబర్‌ 1 – కర్ణాటక ఆవిర్భావ దినోత్సవం, బెంగళూరు, ఇంఫాల్‌లో సెలవు

* నవంబర్ 6 – ఆదివారం

* నవంబర్ 8 – గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి..అగర్తల, బెంగళూరు, గ్యాంగ్‌టక్, గౌహతి, ఇంఫాల్, కోచి, పాణాజి, పాట్నా, షిల్లాంగ్, తిరువనంతపురంలో సెలవు

* నవంబర్ 11 – కనకదాస జయంతి-వంగల పండుగ..బెంగళూరు, షిల్లాంగ్‌లో సెలవు

* నవంబర్‌ 12 – రెండో శనివారం

* నవంబర్‌ 13 ఆదివారం

* నవంబర్‌ 20 – ఆదివారం

* నవంబర్‌ 23 – సేంగ్‌ పండగ (షిల్లాంగ్‌లో సెలవు)

* నవంబర్‌ 26- నాలుగో శనివారం

* నవంబర్‌ 27 – ఆదివారం

Next Story